Prasanna Vadanam Day 1 Collections: సుహాస్ మూవీకి ఊహించని వసూళ్లు.. మొదటి రోజు ఎంతో తెలిస్తే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నేచురల్ యాక్టింగ్‌తో అలరించే యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో సుహాస్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన అతడు.. వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. మరి సుహాస్ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి!
ప్రసన్న వదనం అంటూ:సుహాస్ నటించిన చిత్రమే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే తెరకెక్కించిన ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.

సుహాస్ మూవీ బిజినెస్:వరుస హిట్లతో దూసుకుపోతోన్న సుహాస్ నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'ప్రసన్న వదనం'. విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన ఇది ప్రచార చిత్రాలతో ఆకట్టుకుని అంచనాలను భారీ స్థాయిలో ఏర్పరచుకుంది. తద్వా మంచి డిమాండ్‌ను పెంచుకుని భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ను చేసుకుంది. ఇలా ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 2.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసింది.
టాక్‌కు తగ్గ స్పందనతో:ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రూపొందిన 'ప్రసన్న వదనం' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆ రేంజ్‌లోనే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆశించిన రీతిలో కంటే ఎక్కువగానే వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు.
తొలి రోజు ఎంత వచ్చింది?:డిఫరెంట్ స్టోరీలైన్‌తో రూపొందిన 'ప్రసన్న వదనం' మూవీకి టాక్‌కు అనుగుణంగా మంచి స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా తక్కువ థియేటర్లలో వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 25 లక్షలు షేర్ వసూలు అయింది. అలాగే, రూ.45 లక్షలు గ్రాస్‌ను ఇది రాబట్టుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?:టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ గాయ్ సుహాస్ హీరోగా నటించిన 'ప్రసన్న వదనం' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 25 లక్షలు షేర్ వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 10 లక్షలు మాత్రమే వసూలు చేసింది. వీటితో కలిపి మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 35 షేర్‌తో పాటు రూ. 70 లక్షలు గ్రాస్ వచ్చింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:విభిన్నమైన సబ్జెక్టుతో రూపొందిన 'ప్రసన్న వదనం' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు సుహాస్ సినిమాకు రూ. 35 లక్షలు వచ్చాయి. అంటే మరో రూ. 2.15 కోట్లు రాబడితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











