బాక్సాఫీస్ వద్ద సూయి ధాగా దూకుడు.. 50 కోట్లకు చేరువలో..
బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, అనుష్క శర్మ నటించిన సూయి ధాగా.. మేడిన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్నది. రిలీజ్ రోజున రూ.8.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం వారాంతంలో కూడా కలెక్షన్ల సత్తాను చూపించింది. శనివారం రూ.12.25 కోట్లు, ఆదివారం రూ.16.05 కోట్లు రాబట్టింది. దాంతో వారాంతంలో మొత్తంగా రూ.36.60 కోట్లు వసూలు చేసింది.
గతవారం రిలీజైన విశాల్ భరద్వాజ్ చిత్రం పటాకాను మించి వసూళ్లు రాబట్టడం విశేషం. అక్టోబర్ 2వ తేది గాంధీ జయంతి సెలవు దినం కావడంతో ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌కు చేరువయ్యే అవకాశం ఉంది.

గుండెను పిండేసే విధంగా దర్శకుడు శరత్ కటారియా సూయి ధాగాను రూపొందించాడు. కుట్టు మిషన్ల అమ్మే షాపులో పనిచేసే సేల్స్ మెన్‌గా వరుణ్ ధావన్ నటించాడు. సాధారణ గృహిణిగా, వరుణ్ భార్య అనుష్క శర్మ కనిపిచింది. ఫ్యాషన్ దుస్తుల తయారీ చేసి గ్రామీణ యువకుడు జాతీయ స్థాయిలో ఎలాంటి గుర్తింపు పొందాడనే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో ఎన్నో భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలు ఆకట్టుకొంటున్నాయి.


Click it and Unblock the Notifications











