'ఉప్పెన' 100కోట్లు కాకపోయినా ఆ స్థాయిలో రాబట్టగలదు.. కలెక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా బజ్ క్రియేట్ చేస్తున్న చిత్రం ఉప్పెన. చాలా రోజుల తరువాత ఒక లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకి వస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోగలదని ఒక నమ్మకం వచ్చేసింది నిర్మాతలకు. ఇక సహా నిర్మాతగా ఉన్న సుకుమార్ ఇటీవల సినిమా బడ్జెట్ అలాగే రాబోయే కలెక్షన్స్ పై ఒక వివరణ ఇచ్చారు.

పాజిటివ్ వైబ్రేషన్స్
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సీరియస్ లుక్ లో విజయ్ సేతుపతి షాక్ ఇచ్చాడని వస్తున్న టాక్ పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తోంది. విడుదలైన ట్రైలర్ తోనే సినిమాపై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

అనూహ్యంగా పెరిగిన బడ్జెట్
సినిమాను మొదట 10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ లెక్కలు 17కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శకుడి మీద నమ్మకం వల్ల సుకుమార్ సపోర్ట్ తో నిర్మాతలు ధైర్యం చేశారు. పూర్తిగా కొత్త వాళ్ళతో ఈ స్థాయిలో సినిమాను నిర్మించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు.

బిజినెస్ ఏ లెవెల్లో చేసిందంటే..
ఇక సినిమాకు సంబంధించిన బజ్ వల్ల బిజినెస్ కూడా గట్టిగానే పెరిగింది. ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా నైజాం హక్కులు 6కోట్ల ధర పలుకగా సీడెడ్ రైట్స్ 3కోట్ల వరకు ధర పలికినట్లు సమాచారం. ఇక ఆంధ్రాలో 10కోట్ల వరకు బిజినెస్ చేస్తోంది. ఎపి తెలంగాణ మొత్తంగా ఉప్పెన 19కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

కలెక్షన్స్‌పై సుకుమార్ కామెంట్
వరల్డ్ వైడ్ గా మొత్తంగా సినిమా 20.5కోట్ల బిజినెస్ చేస్తుండడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లు. ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం ఉప్పెన సినిమా ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని టాక్ వస్తోంది. ఇక సుకుమార్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కలెక్షన్స్ పై ఒక కామెంట్ చేశారు. కథ విన్నపుడే 100కోట్ల సినిమా అని నిర్మాతలకు చెప్పాను. ఇక ఇప్పుడు అంత కాకపోయినా కూడా 90కోట్ల వరకు తప్పకుండా కలెక్ట్ చేస్తుందని.. సుకుమార్ నమ్మకంతో చెప్పారు. మరి ఆయన మాటలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











