డెఫిషిట్ లో 'సుకుమారుడు'...ఎంతంటే
హైదరాబాద్: సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై ఆది(సాయికుమార్ కొడుకు) హీరోగా కె. వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'సుకుమారుడు'. 'పిల్ల జమీందారు' ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం దాదాపు ఏడున్నర కోట్ల రూపయాల బడ్జెట్ తో నిర్మితమైందని, మూడు కోట్లు డెఫిషిట్ తో రిలీజ్ అవుతోందని సమాచారం.
ఆది మార్కెట్ ని మించి ఖర్చు పెట్టారని, అందుకే డెఫిషిట్ లో విడుదల చేయాల్సి వస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ చిత్రంలో యుఎస్ లో ఉండే అశోక్ సోదరి కూడా ఇన్వెస్ట్ చేసిందని తెలుస్తోంది. ఆది గత చిత్రాలు ప్రేమ కావాలి, లవ్ లీ రెండూ భాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపకపోవటం కూడా బిజినెస్ పరంగా దెబ్బతీసిందని చెప్తున్నారు.
ఈ చిత్రంపై ఆది చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ... నేటి తరానికి తగ్గట్లు ఈ చిత్రాన్ని అశోక్ రూపొందించారు. అన్ని తరగతుల వారికీ వంద శాతం నచ్చే సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సకుటుంబ సమేతం చూసి ఆస్వాదించదగ్గ తెలుగు సినిమా. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉండేలా చిత్రాన్ని తీశారు అశోక్. నటులు కాకుండా పాత్రలు కనిపిస్తాయి. అందుకే ప్రేక్షకులు చిత్రంలోని పాత్రల గురించే మాట్లాడుకుంటారు. సినిమాలో నిర్మాణ విలువలు రిచ్‌గా ఉంటాయి. 98 పని దినాల్లో చిత్రాన్ని పూర్తి చేశారు నిర్మాత వేణుగోపాల్ అన్నారు.
ఇక ఇందులో నేను సుకుమార్ అనే ఎన్నారై పాత్ర చేశాను. దర్శకుడు అశోక్ నా పాత్రను కొత్తగా డిజైన్ చేశారు. పాత్రలో పలు ఛాయలుంటాయి. పేరుకు మాత్రమే 'సుకుమారుడు'. కానీ అందుకు విరుద్ధంగా నడిచే స్వార్థపరుడు. అలాంటి వాడు సుకుమారుడుగా ఎలా మారాడన్నదే కథ. నా మునుపటి సినిమా 'లవ్‌లీ'లో చేసిన క్లైమాక్స్ సీన్ సుకుమార్ పాత్రని సమర్థవంతంగా చేయడానికి సాయపడింది అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రం రిజల్ట్ ఏంటన్నది రేపటికి తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











