twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రేడ్ టాక్ : 'సుకుమారుడు' ఫైనల్ రిజల్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై ఆది(సాయికుమార్ కొడుకు) హీరోగా కె. వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'సుకుమారుడు'. 'పిల్ల జమీందారు' ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మార్నింగ్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

    సినిమా చాలా కన్ఫూజన్ గా ఉందని, ఒక సీన్ కు మరో సీన్ కు లింక్ లేకుండా పోయిందని, లెంగ్త్ ఎక్కువైందని అందరూ అన్నారు. ఈ నేపధ్యంలో సుకుమారుడు లెంగ్త్ తగ్గించారని సమాచారం. అయినా వీకెండ్స్ లో కూడా కలెక్షన్స్ లేకుండా పోయాయి. దాంతో సినిమాని కొనుక్కున్న వాళ్లంతా పూర్తి లాస్ అని ఫిక్స్ అయిపోయారు.

    గతంలో వచ్చిన ఆది చిత్రాలు లవ్లీ,ప్రేమే కావాలి కూడా పెద్దగా ఆడలేదు. అయినా ధైర్యం చేసి నిర్మాతలు దాదాపు ఏడున్నర కోట్ల రూపయాల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే మూడున్నర కోట్ల డెఫిషిట్ అని, రిలీజ్ అయ్యాక పైసా వెనక్కి రాదని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.

    కథ ఏమిటంటే.....అమెరికాలో ఉండే సుకుమార్ (ఆది) సెల్ఫిష్, మనీ మైండెడ్. వెరీ సక్సెస్ ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అతనికి అత్యవసరంగా భారీగా డబ్బు అవసం పడుతుంది. ఇండియాలో తనకు వారసత్వంగా దక్కాల్సిన రూ.150 కోట్ల ఆస్తి ఉండటంతో ఇండియా వస్తాడు. తన గ్రాండ్ మదర్ వందనమ్మ(శారద) నుంచి ఆస్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పుడు, దాన్ని దక్కించుకోవడానికి అనేక తిరకాసులు ఉండటం సహజమే. ఇక్కడ సుకుమార్ తన అంకుల్ రావు రమేష్ నుంచి ఇలాంటి తిరకాసులే ఎదుర్కొంటాడు. ఈక్రమంలో శంకరి(నిషా అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. మరి సుకుమార్ ఆ ఆస్తిని ఎలా దక్కించుకున్నాడు? తన గ్రాండ్ మదర్‌‌ను ఎలా ఒప్పించాడు? శంకరితో సుకుమార్ ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగతా స్టోరీ.

    English summary
    
 Sukumarudu, Aadi's third movie, directed by G. Ashok released last friday across the world. There had been expectations from this movie because of the trailer and also because of the cast which looked apealing. But it Failed at Box Office miserably.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X