Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్‌పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ట్రేడ్ టాక్ : 'సుకుమారుడు' ఫైనల్ రిజల్ట్
సినిమా చాలా కన్ఫూజన్ గా ఉందని, ఒక సీన్ కు మరో సీన్ కు లింక్ లేకుండా పోయిందని, లెంగ్త్ ఎక్కువైందని అందరూ అన్నారు. ఈ నేపధ్యంలో సుకుమారుడు లెంగ్త్ తగ్గించారని సమాచారం. అయినా వీకెండ్స్ లో కూడా కలెక్షన్స్ లేకుండా పోయాయి. దాంతో సినిమాని కొనుక్కున్న వాళ్లంతా పూర్తి లాస్ అని ఫిక్స్ అయిపోయారు.
గతంలో వచ్చిన ఆది చిత్రాలు లవ్లీ,ప్రేమే కావాలి కూడా పెద్దగా ఆడలేదు. అయినా ధైర్యం చేసి నిర్మాతలు దాదాపు ఏడున్నర కోట్ల రూపయాల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందే మూడున్నర కోట్ల డెఫిషిట్ అని, రిలీజ్ అయ్యాక పైసా వెనక్కి రాదని ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు.
కథ ఏమిటంటే.....అమెరికాలో ఉండే సుకుమార్ (ఆది) సెల్ఫిష్, మనీ మైండెడ్. వెరీ సక్సెస్ ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అతనికి అత్యవసరంగా భారీగా డబ్బు అవసం పడుతుంది. ఇండియాలో తనకు వారసత్వంగా దక్కాల్సిన రూ.150 కోట్ల ఆస్తి ఉండటంతో ఇండియా వస్తాడు. తన గ్రాండ్ మదర్ వందనమ్మ(శారద) నుంచి ఆస్తిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత భారీ మొత్తంలో ఆస్తి ఉన్నప్పుడు, దాన్ని దక్కించుకోవడానికి అనేక తిరకాసులు ఉండటం సహజమే. ఇక్కడ సుకుమార్ తన అంకుల్ రావు రమేష్ నుంచి ఇలాంటి తిరకాసులే ఎదుర్కొంటాడు. ఈక్రమంలో శంకరి(నిషా అగర్వాల్)తో ప్రేమలో పడతాడు. మరి సుకుమార్ ఆ ఆస్తిని ఎలా దక్కించుకున్నాడు? తన గ్రాండ్ మదర్‌ను ఎలా ఒప్పించాడు? శంకరితో సుకుమార్ ప్రేమ వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది మిగతా స్టోరీ.