»   » ‘బాహుబలి’ని దాటేస్తుందా? ఐదురోజుల్లో రూ. 344 కోట్ల కలెక్షన్!

‘బాహుబలి’ని దాటేస్తుందా? ఐదురోజుల్లో రూ. 344 కోట్ల కలెక్షన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'సుల్తాన్' బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈద్ సందర్భంగా రిలీజైన్ ఈ మూవీ ఓపెనింగ్ రికార్డులు బద్దలు కొట్టడంతో విఫలమైనా.... పాజిటివ్ మౌత్ టాక్ తో సూపర్ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెలుతోంది.

ఈ సినిమా విడుదలైన తొలి ఐదురోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 344 కోట్ల బిజినెస్ చేయడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సల్మాన్ సినిమా స్టామినా బాక్సాఫీసు వద్ద ఏ రేంజిలో ఉంటుందో మరోసారి నిరూపించింది.

నాలుగో రోజు కలెక్షన్‌తోనే 'సుల్తాన్‌' ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలవడం గమనార్హం. కనీసం వారం కూడా గడవక ముందు 'సుల్తాన్' కలెక్షన్ల తాకిడి ఈ రేంజిలో ఉందంటే పూర్తి బిజినెస్ అయ్యేలోపు బాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులు తుడిచి పెట్టుకోవడం ఖాయం అంటున్నారు.

సుల్తాన్ జోరు చూస్తుంటే 'బాహుబలి' సినిమా కలెక్షన్లను సైతం సునాయాసంగా అధిగమిస్తుందని స్పష్టమవుతోంది. ఐదురోజుల్లోనే రూ. 350 కోట్లకు చేరువైనా 'సుల్తాన్' కు రూ. 650 కోట్ల బిజినెస్ చేసిన బాహుబలిని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.

తొలి ఐదు రోజుల్లో సుల్తాన్ కలెక్షన్ ఎలా ఉన్నాయో స్లైడ్ షోలో..

ఓవర్సీస్ లో కేక

ఓవర్సీస్ లో కేక

తొలిరోజు అంటే బుధవారం ఓవర్‌సీస్‌లో 20.4కోట్లు సాధించింది.

ఈ రేంజిలో ఊహించలేదు

ఈ రేంజిలో ఊహించలేదు

ఓవర్సీస్ మార్కెట్లో సుల్తాన్ సినిమాకు ఇంత బిజినెస్ అవుతుందని ఊహించలేదు. బుధవారం 20 కోట్లు రాగా...గురువారం 18.5 కోట్లు, శుక్రవారం 18.8 కోట్లు, శనివారం 19.8 కోట్లు, ఆదివారం 14.5 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. మొత్తం 92 కోట్లు వసూలు చేసింది.

ఇండియాలో

ఇండియాలో

ఇండియాలో ఐదు రోజులకు 252.5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో కలిసిప్రపంచవ్యాప్తంగా రూ.344.5 కోట్లు గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది.

అన్నీ బద్దలవ్వడం ఖాయం

అన్నీ బద్దలవ్వడం ఖాయం

సుల్తాన్ సినిమా దెబ్బకు బాలీవుడ్లో రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

English summary
Salman Khan's desi wrestler antics in his latest release Sultan continued to rule the hearts of fans. In just five days, the movie has collected Rs 344.5 crore worldwide, while the nationwide collections alone amount to Rs 252.5 crore according to a statement issued by Yash Raj Films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu