Sulthan movie collections.. కార్తీ బాక్సాఫీస్ స్టామినాకు అగ్ని పరీక్ష.. తొలి రోజు పరిస్థితి ఎలా ఉందంటే...
కోలీవుడ్‌లో సెన్సిబుల్ సినిమాలు, పాత్రలతో ఆలరిస్తున్న యంగ్ హీరో కార్తీకి టాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక సినిమాకు మరో సినిమాకు పొల్చితే చాలా డిఫరెంట్‌గా కనిపించే కార్తీ ఒక్కో మూవీకి తన రేంజ్‌ను పెంచుకొంటూ వెళ్తున్నారు. తాజాగా తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సుల్తాన్‌తో ఏప్రిల్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉంటుందనే వివరాల్లోకి వెళితే...

తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేటర్ల సంఖ్య
రష్మిక మందన్నతో తొలిసారి కార్తీ నటించడం, టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దాంతో థియేటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కార్తీ కెరీర్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా నైజాంలో సుమారు 190 థియేటర్స్‌లో రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 450 థియేటర్లలో రిలీజైనట్టు సమాచారం.

సుల్తాన్ ప్రీ రిలీజ్ బిజినెస్
సుల్తాన్ సినిమా విషయానికి వస్తే.. భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాంలో రూ.2 కోట్ల మేర, సీడెడ్‌లో రూ.1 కోటి, ఆంధ్రాలో రూ.3 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు సమాచారం. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సుమారు రూ.6.5 కోట్లుగా సెట్ చేశారు. కమర్షియల్‌గా వర్కవుట్ కావాలంటే ఈ లక్ష్యాన్ని అధిగమించాల్సిందే.

హైదరాబాద్, వైజాగ్‌లో సానుకూలంగా
ఇక తొలి రోజు సుల్తాన్ పాజిటివ్ నోట్‌తోనే బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉదయం, మ్యాట్నీ షోలకు లక్షకుపైనే కలెక్ట్ చేసినట్టు తెలుస్తున్నది. అలాగే వైజాగ్‌లో కూడా మధ్యాహ్నం ఆట పూర్తయ్యే వరకు దాదాపు రూ.3 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఆంధ్రా, నైజాంలో మిగితా సెంటర్లలో వసూళ్లు భారీగానే ఉన్నట్టు తెలుస్తున్నది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా
తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి రిపోర్టుల వస్తున్న అనంతరం సుల్తాన్ ఓ మోస్తారు నుంచి భారీ మధ్య వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాల రిపోర్టుల ప్రకారం.. తొలి రోజు రూ.2 కోట్ల మేర వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ వారాంతం వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకున్నట్లయితే మంచి గణాంకాలను నమోదు చేసే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications











