twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sulthan 2 days collections: మరోసారి తెలుగులో కార్తీ దూకుడు.. కానీ ఈ స్పీడ్ సరిపోదు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ సెట్ చేసుకున్న హీరోల్లో కార్తీ ఒకరు. ఆల్ మోస్ట్ ఇక్కడి మీడియం రేంజ్ హీరోల లెవెల్లో కార్తీ సినిమాలు విడుదల అవుతుంటాయి. వీలైనంత వరకు తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసే కార్తీ ఈ సారి సుల్తాన్ సినిమాతో వచ్చాడు. వైల్డ్ డాగ్ తో పాటు శుక్రవారం బాక్సాఫీస్ రంగంలోకి దిగిన సినిమా రెండవ రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది.

    ఎట్రాక్ట్ చేసిన సినిమా

    ఎట్రాక్ట్ చేసిన సినిమా

    బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన సుల్తాన్ సినిమాలో రష్మీక మందన్న హీరోయిన్ గా నటించింది. 100మంది రౌడీలతో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించిన దర్శకుడు ఓ వర్గం వారిని కథతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేశాడు. మొత్తానికి సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మంచి వసూళ్లను అందుకుంది.

    టార్గెట్ ఎంతంటే

    టార్గెట్ ఎంతంటే

    శుక్రవారం వైల్డ్ డాగ్ తో పాటిగా వచ్చిన సుల్తాన్ ఊహించినట్లుగానే గట్టి పోటీని ఇచ్చింది. ఒక విదంగా నాగార్జున వైల్డ్ డాగ్ పై ప్రభావం గట్టిగానే పడ్డట్లు తెలుస్తోంది. ఇక సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తెలుగులో 6కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సుల్తాన్ సినిమా 6.5కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో మార్కెట్ లోకి వెళ్లింది.

    2వ రోజు వచ్చిన షేర్

    2వ రోజు వచ్చిన షేర్

    సినిమా మొదటి రోజు తెలుగులో 1.17కోట్ల వరకు షేర్ అందుకుంది. ఇక రెండవ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఈ విదంగా ఉన్నాయి. నైజాం 25లక్షలు, సీడెడ్ 13లక్షలు, ఉత్తరాంధ్ర 9లక్షలు, ఈస్ట్ 7.2లక్ష, వెస్ట్ 3.7లక్షలు, గుంటూరు 5.4లక్షలు, కృష్ణ 5.2లక్షలు, నెల్లూరు 3.3లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్ 0.0.72కోట్లు. గ్రాస్ 1.3కోట్లు

    ఈ స్పీడ్ సరిపోదు

    ఈ స్పీడ్ సరిపోదు

    మొదటి రోజు ఏపీ తెలంగాణలో 1.17కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండవరోజు 72లక్షలు రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే ఈ స్పీడ్ సరిపోదు. మరో 4.61కోట్ల వరకు రాబడితేనే లాభల్లోకి వచ్చినట్లు లెక్క. ఇక ఆదివారం బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. మరి సినిమా వకీల్ సాబ్ వచ్చే లోపు అనుకున్న టార్గెట్ ను టచ్ చేస్తుందో లేదో చూడాలి.

    Read more about: karthi sulthan tollywood box office
    English summary
    Karthi is one of the heroes who has set a unique market of her own in the Tollywood industry. Karthi movies are released at the level of Most Most Medium Range Heroes here. Karthi, who dubs every one of her films in Telugu as much as possible, has come up with Sultan this time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X