Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. లాంచ్, స్పెసిఫికేషన్ల పూర్తి వివరాలు..!!
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ముగిసిన కపటధారి పోరాటం: సుమంత్ కెరీర్ మొత్తంలోనే ఊహించని కలెక్షన్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న హీరోల్లో సుమంత్ ఒకరు. అక్కినేని బ్యాక్ గ్రౌండ్ తో గత 20 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమంత్ కెరీర్ మొదట్లో కొన్ని హిట్స్ అందుకున్నప్పటికి గత 15 ఏళ్లలో మాత్రం సరైన బాక్సాఫీస్ హిట్ అందుకకోలేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ ను అందుకుంటున్నాయి. ఇక చాలా రోజుల తరువాత కపటదారి అనే సినిమాతో హిట్ కొట్టాలని వచ్చాడు. ఆ సినిమా మొత్తం కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది
2017లో మళ్ళీ రావా అనే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న సుమంత్ మొత్తానికి ఒక ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. వీలైనంత వరకు డిఫరెంట్ హిట్స్ అందుకోవాలని అనుకున్నాడు. అయితే ఆ సినిమా తరువాత కూడా సుమంత్ ప్రయోగాత్మకమైన కథలను బాగానే ఎంచుకున్నాడు. కానీ ఆ సినిమాలో వెండితెరపైకి వచ్చేసరికి రివర్స్ అయ్యాయి.
ఎంతో నమ్మకంతో చేసిన సినిమా
ఇక ఎంతో నమ్మకంతో సుమంత్ కన్నడ రీమేక్ కపటధారి అనే సినిమా చేశాడు. ఈ సినిమాను తెలుగు తో పాటు తమిల్ లో కూడా ఒకేసారి తెరకెక్కించగా తమిళ్ లో సత్యరాజ్ తనయుడు సీబీ సత్యరాజ్ నటించాడు. ఇక తెలుగులో కపటధారి ఫిబ్రవరి 19న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా వేడుకకు నాగార్జున కూడా వచ్చారు.
సినిమా టార్గెట్ ఎంతంటే
అయితే సినిమా కనీసం రెండు వారాలు కూడా సరిగ్గా నడవకముందే క్లోజింగ్ కలెక్షన్స్ కు వచ్చేసింది. మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే..మొత్తంగా చేసిన బిజినెస్ 1.9కోట్లు. ఇక 2.1కోట్లతో బ్రేక్ ఈవెన్ తో విడుదలైన కపటధారి ఓపెనింగ్స్ నుంచే తడబడుతూ వచ్చింది. సినిమాకు చేసిన ప్రమోషన్స్ కూడా పెద్దగా హెల్ప్ అవ్వలేదు.
సినిమాకు వచ్చిన నష్టం ఎంతంటే
ఇక రెండు వారాలు కూడా నడవని ఈ సినిమా నిన్నటితో బిజినెస్ ను క్లోజ్ చేసింది. సినిమాకు వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 0.41కోట్లు మాత్రమే. గ్రాస్ అయితే 0.75కోట్లు మాత్రమే వచ్చింది. సినిమా కనీసం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేలేకపోయింది. దాదాపు 1.69కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది. మరి సుమంత్ రాబోయే సినిమాలతో ఎంతవరకు సక్సెస్ అంసుకుంటాడో చూడాలి.