Mem Famous 5 Days collections బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా మేమ్ ఫేమస్.. 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ హీరో, దర్శకుడు సుమంత్ ప్రభాస్ నటించిన మేమ్ ఫేమస్ సినిమా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్‌తో ఛాయ్ బిస్కెట్ ఫిలింస్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
దాదాపు 50 మందికిపైగా కొత్త నటీనటులతో నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్, చంద్రు ఈ సినిమాను నిర్మించడం విశేషంగా మారింది. ఈ సినిమా ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేయడమే కాకుండా మంచి ఒపెనింగ్స్ సాధించింది. మేమ్ ఫేమస్ చిత్రం గత 5 రోజుల్లో ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..

మేమ్ ఫేమస్ చిత్రం తక్కువ బడ్జెట్‌తో అంతా కొత్త నటీనటులతో రూపొందించారు. ఈ సినిమాను దాదాపు 2.5 కోట్ల రూపాయలతో తెరకెక్కించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ కావడంతో సొంతంగా రిలీజ్ చేశారు. ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా అమ్మకుండా తమ వద్దే పెట్టుకొన్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ రిలీజ్ చేసింది.
మేమ్ ఫేమస్ చిత్రం తెలుగు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి ఒపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 75 లక్షల రూపాయలు, రెండో రోజు 73 లక్షల రూపాయలు, మూడో రోజు 72 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తొలి వారాంతానికి 2.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక తొలివారంతం తర్వాత నిలకడగా వసూళ్లను సాధించింది. మహేష్ బాబు, రాజమౌళి లాంటి ప్రముఖులు ట్వీట్లు వేయడంతో బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. సోమవారం 38 లక్షలు, మంగళవారం 35 లక్షల రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో సాధించింది. దాంతో గత 5 రోజుల్లో ఈ చిత్రం 3 కోట్ల వసూళ్లను సాధించింది.
ఇక ఓవర్సీస్‌లో ముఖ్యంగా అమెరికాలో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గత నాలుగు రోజుల్లో 100K డాలర్ల వసూళ్లను రాబట్టింది. అంటే భారతీయ కరెన్సీలో 80 లక్షలకుపైగా వసూళ్లను సాధించింది. కన్నడ, తమిళనాడుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గత 5 రోజుల్లో 4.3 కోట్ల రూపాయలను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











