Mem Famous 6 Days Collections: మేమ్ ఫేమస్ సంచలనం.. 6 రోజుల్లోనే టార్గెట్ ఔట్.. 13వ సినిమాగా రికార్డు
ఈ మధ్య కాలంలో యూత్‌ఫుల్ లవ్ స్టోరీలతో సినిమాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఆ తరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులను నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత వారంలో విడుదలైన క్రేజీ మూవీనే 'మేమ్ ఫేమస్'. దీని ద్వారా సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా టాలీవుడ్‌లో పరిచయం అవుతున్నాడు.
విడుదలకు ముందే ఈ చిత్రం ప్రచారం ద్వారా చాలా హాట్ టాపిక్‌గా మారింది. అందుకు అనుగుణంగానే ఇది టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లను రాబట్టి హిట్‌గా నిలిచింది. మరి 'మేమ్ ఫేమస్' మూవీ 6 రోజుల రిపోర్టును మీరే చూడండి!

మేమ్ ఫేమస్ అని వచ్చారు:సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా రూపొందిన చిత్రమే 'మేమ్ ఫేమస్'. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి తదితరులు కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌లు నిర్మించారు. దీనికి కల్యాణ్ మాణిక్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్రం మే 26వ తేదీన ఎంతో గ్రాండ్ రిలీజ్ అయింది.

మేమ్ ఫేమస్ బిజినెస్ ఇలా:యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'మేమ్ ఫేమస్' మూవీ ఆరంభంలోనే అదిరిపోయే ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ సినిమా హక్కులకు మంచి పోటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకూ కలుపుకుని ఇది ఏకంగా రూ. 2 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో గ్రాండ్‌గా విడుదల అయింది.

6వ రోజు తెలుగు వసూళ్లిలా:తెలంగాణలోని పల్లెటూరి నేపథ్యంతో సాగే కొందరు చిల్లర కుర్రాళ్ల కథతో రూపొందిన చిత్రమే 'మేమ్ ఫేమస్'. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి కలెక్షన్లు అంతగా రావని అంతా అనుకున్నారు. కానీ, ఇది బానే రాబడుతోంది. ఇలా 6వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 33 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది.

6 రోజులకూ ఎంత వచ్చింది?:6 రోజుల్లో 'మేమ్ ఫేమస్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌తో సంబంధం లేకుండానే వసూళ్లు మంచిగా వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.10 కోట్లు గ్రాస్, ఆంధ్రా ప్లస్ సీడెడ్ ఏరియాలు అన్నీ కలిపి రూ. 1.41 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ. 3.51 కోట్లు గ్రాస్, రూ. 1.76 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది:ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో విశేషంగా రూ. 3.51 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకున్న 'మేమ్ ఫేమస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించే కలెక్షన్లనే రాబట్టింది. దీంతో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం రూ. 1.08 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రూ. 4.59 కోట్లు గ్రాస్, రూ. 2.23 కోట్లు షేర్‌ను రాబట్టింది.

మూవీకి టార్గెట్.. లాభమెంత?:యూత్‌ఫుల్ స్టోరీతో రూపొందిన 'మేమ్ ఫేమస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.20 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 2.23 కోట్లు వచ్చాయి. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు రూ. 3 లక్షలు లాభాలు కూడా లభించాయి. ఇక, టార్గెట్ చేరడంతో ఈ చిత్రం ఈ ఏడాది టాలీవుడ్‌లో హిట్టైన 13వ చిత్రంగా రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











