Mem Famous 9 Days Collections: పెరిగిన వసూళ్లు.. 9 రోజుల్లో అన్ని కోట్లు.. ఆ మార్కు దాటిన లాభాలు

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మూవీలకు తెలుగులో మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలి కాలంలోనే ఇలా వచ్చిన పలు సినిమాలు విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే వచ్చిన మరో క్రేజీ సినిమా 'మేమ్ ఫేమస్'.

యంగ్ టాలెంటెడ్ గాయ్ సుమంత్ ప్రభాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి ప్రమోషన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లుగానే గ్రాండ్‌గా విడుదలై కలెక్షన్లను రాబట్టి హిట్‌గా నిలిచింది. ఇక, 9వ రోజు దీనికి వసూళ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో 'మేమ్ ఫేమస్' మూవీ తొమ్మిది రోజుల రిపోర్టును మీరే చూడండి!

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

మేమ్ ఫేమస్.. అరాచకంగా: సుమంత్ ప్రభాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన చిత్రమే 'మేమ్ ఫేమస్'. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, అంజి తదితరులు కీలక పాత్రలను పోషించిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్‌లు నిర్మించారు. దీనికి కల్యాణ్ మాణిక్ సంగీతం ఇచ్చారు. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌తో అరాచకమే సృష్టించింది.

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

మేమ్ ఫేమస్ బిజినెస్ ఇలా: క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మేమ్ ఫేమస్' మూవీ ఆరంభంలోనే అదిరిపోయే ప్రమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఈ సినిమా హక్కులకు మంచి పోటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకూ కలుపుకుని ఇది ఏకంగా రూ. 2 కోట్లు మేర బిజినెస్‌ను జరుపుకుంది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిపోయింది.

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

9వ రోజు తెలుగు వసూళ్లిలా: కొందరు అల్లరి కుర్రాళ్ల కథతో రూపొందిన చిత్రమే 'మేమ్ ఫేమస్'. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో వచ్చిన ఈ చిత్రానికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో దీనికి కలెక్షన్లు అంతగా రావని అంతా అనుకున్నారు. కానీ, ఇది మంచిగానే రాబడుతోంది. ఈ క్రమంలోనే 8వ రోజు రూ. 24 లక్షలు రాబట్టిన ఈ చిత్రం.. 9 రోజు కాస్త పెరిగి దీనికి రూ. 33 లక్షలు గ్రాస్‌ వచ్చింది.

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

9 రోజుల్లో ఎంత వచ్చింది?: తొమ్మిది రోజుల్లో 'మేమ్ ఫేమస్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో టాక్‌తో సంబంధం లేకుండానే వసూళ్లు మంచిగా వచ్చాయి. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 2.60 కోట్లు గ్రాస్, ఆంధ్రా ప్లస్ సీడెడ్‌ ఏరియాలు అన్నీ కలిపి రూ. 1.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 9 రోజుల్లో రూ. 4.35 కోట్లు గ్రాస్, రూ. 2.18 కోట్లు షేర్ వచ్చింది.

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 9 రోజుల్లో విశేషంగా రూ. 4.35 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకున్న 'మేమ్ ఫేమస్' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ పర్వాలేదనిపించే కలెక్షన్లనే రాబట్టింది. దీంతో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ చిత్రం రూ. 1.31 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 5.66 కోట్లు గ్రాస్, రూ. 2.75 కోట్లు షేర్‌ను రాబట్టింది.

Sumanth Prabhas Starrer Mem Famous Movie 9 Days Collections

మూవీకి టార్గెట్.. లాభమెంత?: యూత్‌ఫుల్ స్టోరీతో వచ్చిన 'మేమ్ ఫేమస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.20 కోట్లుగా నమోదైంది. ఇక, తొమ్మిది రోజుల్లో దీనికి రూ. 2.75 కోట్లు వచ్చాయి. అంటే.. క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు ఈ సినిమాకు రూ. 55 లక్షలు లాభాలు కూడా లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X