A1 Express 5 Days Collections: దారుణంగా క్షీణించిన కలెక్షన్లు.. పాజిటివ్ టాక్ వచ్చినా..
కెరీర్ ఆరంభం నుంచే వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ.. సరైన హిట్లను మాత్రం అందుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. కెరీర్ ఆరంభంలో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' వంటి భారీ విజయాన్ని అందుకున్న అతడు.. మరో సక్సెస్ కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కినా.. ఆ తర్వాత మళ్లీ నిరాశే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ప్రెస్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

తొలిసారి అలా వచ్చిన చిత్రమే ‘A1 ఎక్స్‌ప్రెస్’
సందీప్ కిషన్.. లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్'. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తొలిసారి హాకీ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రాన్ని డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఇది మార్చి 5న రిలీజ్ అయింది.

పాజిటివ్ టాక్.. మంచి రివ్యూలు... ఖుషీగా
టీజర్, ట్రైలర్‌తోనే 'A1 ఎక్స్‌ప్రెస్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మొదటి ఆట నుంచే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అలాగే, నటుడిగా సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు కూడా జరుపుకుంటోంది.

ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే హిట్?
మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ మార్కెట్ కొంచెం తక్కువని చెప్పాలి. కానీ 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఐదో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
రోజు రోజుకూ తగ్గుతూ వస్తోన్న 'A1 ఎక్స్‌ప్రెస్' కలెక్షన్లు.. ఐదో రోజు అదే రీతిలో ఉన్నాయి. మంగళవారం నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 4.20 లక్షలు, నెల్లూరులో రూ. 2.60 లక్షలతో రూ. 37 లక్షలు షేర్, రూ. 70 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఐదు రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?
'A1 ఎక్స్‌ప్రెస్' తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రూ. 76 లక్షలు, 68 లక్షలు, రూ. 70 లక్షలు, రూ. 44 లక్షలు, రూ. 37 లక్షలు రాబ్టటింది. అంటే ఐదు రోజులకు మొత్తంగా రూ. 2.95 కోట్లు షేర్, రూ. 5.19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 8 లక్షలు వచ్చాయి. దీంతో మొత్తంగా రూ. 3.13 కోట్లు షేర్, రూ. 5.60 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఒక రోజే మిగిలింది.. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?
'A1 ఎక్స్‌ప్రెస్'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ. 3.13 కోట్లు కలెక్ట్ చేసింది. మరో రూ. 1.87 కోట్లు వసూలు చేస్తేనే ఇది కమర్షియల్‌గా హిట్ అయినట్లు లెక్క. కానీ, గురువారమే మూడు సినిమాలు విడుదల కానున్నాయి. అప్పటి నుంచి కలెక్షన్లు మరింత తగ్గే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











