A1 Express 6 Days Collections: ఊహించని విధంగా కలెక్షన్లు.. ఇంకా అంత వస్తేనే హిట్ అయినట్లు!

చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. అయినప్పటికీ అతడికి నిరాశనే ఎదురవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాలో నటించాడు. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కొత్త తరహా కథలతో రావాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అతడు 'A1 ఎక్స్‌ప్రెస్' అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. ఎన్నోఅంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఊహించని విధంగా కలెక్షన్లు రాబడుతోంది.

తెలుగులో తొలిసారి అలాంటి కథతో వచ్చింది

తెలుగులో తొలిసారి అలాంటి కథతో వచ్చింది


డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన చిత్రమే 'A1 ఎక్స్‌ప్రెస్'. తెలుగులోనే తొలిసారి హాకీ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం మార్చి 5న రిలీజ్ అయింది.

అన్నీ పాజిటివ్‌గానే.. చిత్ర యూనిట్ సంబరం

అన్నీ పాజిటివ్‌గానే.. చిత్ర యూనిట్ సంబరం

'A1 ఎక్స్‌ప్రెస్' మూవీపై ప్రారంభంలో పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. కానీ, టీజర్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా హైప్ వచ్చింది. అందుకు అనుగుణంగానే యూనివర్శల్ సబ్జెట్‌తో వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా అనుకూలంగానే వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ విజయోత్సవ సంబరాలు కూడా జరుపుకుంటోంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్?


మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ మార్కెట్ కొంచెం తక్కువని చెప్పాలి. కానీ 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఆరో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

ఆరో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?


ప్రస్తుత పరిస్థితుల్లో ఆరో రోజు 'A1 ఎక్స్‌ప్రెస్' కలెక్షన్లు పర్వాలేదనిపించాయి. బుధవారం నైజాంలో రూ. 7 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3.20 లక్షలు, కృష్ణాలో రూ. 3.40 లక్షలు, నెల్లూరులో రూ. 1.80 లక్షలతో ఏపీ టీఎస్‌లో రూ. 28 లక్షలు షేర్, రూ. 56 లక్షలు గ్రాస్ వచ్చింది.

ఆరు రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?

ఆరు రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?


'A1 ఎక్స్‌ప్రెస్' తెలుగు రాష్ట్రాల్లో వరుసగా రూ. 76 లక్షలు, 68 లక్షలు, రూ. 70 లక్షలు, రూ. 44 లక్షలు, రూ. 37 లక్షలు, రూ. 28 లక్షలు రాబ్టటింది. అంటే ఆరు రోజులకు మొత్తంగా రూ. 3.23 కోట్లు షేర్, రూ. 5.75 కోట్లు గ్రాస్ వచ్చింది. కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 11 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 10 లక్షలు వచ్చాయి. ఫలితంగా రూ. 3.44 కోట్లు షేర్, రూ. 6.25 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఇంకా అంత వస్తేనే హిట్ అయినట్లు లెక్క

ఇంకా అంత వస్తేనే హిట్ అయినట్లు లెక్క


'A1 ఎక్స్‌ప్రెస్'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, ఐదు రోజుల్లో ఈ చిత్రం రూ. 3.44 కోట్లు కలెక్ట్ చేసింది. మరో రూ. 1.56 కోట్లు వసూలు చేస్తేనే ఇది కమర్షియల్‌గా హిట్ అయినట్లు లెక్క. కానీ, గురువారం మూడు సినిమాలు విడుదల అవతున్నాయి. దీంతో ఈ మూవీ కలెక్షన్లు మరింత తగ్గే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X