Ooru Peru Bhairavakona Collections: 11 కోట్లు కావాలి.. 10 రోజుల్లో అన్ని కోట్లు ఔట్.. హిట్ కావాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ జోనర్లలో సినిమాలు చేస్తూ.. తనదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోన్నాడు టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్. ఎన్ని ప్రయోగాలు చేసినా విజయాన్ని అందుకోలేకపోతోన్న అతడు.. ప్రయత్నాలను మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు.
ఇలా ఇటీవలే సందీప్ 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. కానీ, వీక్ డేస్‌లో డౌన్ అయినా వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో 'ఊరు పేరు భైరవకోన' 10 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి!

భైరవకోనతో సందీప్ ఎంటర్: సందీప్ కిషన్ హీరోగా నటించిన హర్రర్ మూవీనే 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు. శేఖర్ చంద్ర ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చారు.

సందీప్ మూవీ బిజినెస్ ఇలా: సందీప్ కిషన్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 110.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

10వ రోజు తెలుగులో వసూళ్లు: సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన'కు మొదటి వీకెండ్ అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది క్రమంగా డౌన్ అయిపోయింది. కానీ, రెండో వీకెండ్‌లో ఇది బాగానే పుంజుకుంది. ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ వసూలు చేసింది.

10 రోజుల్లో ఎంత వచ్చింది?: విభిన్నమైన కథతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి 10 రోజుల్లో డీసెంట్ రెస్పాన్సే లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 3.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 3.35 కోట్లు రాబట్టింది. ఇలా 10 రోజుల్లో ఈ సినిమా రూ. 7.43 కోట్లు షేర్, రూ. 13.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.43 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 2.27 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 10 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.70 కోట్లు షేర్, రూ. 21.75 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?: సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, 10 రోజుల్లో దీనికి రూ. 9.70 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 1.30 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











