Ooru Peru Bhairavakona Collections: కుమ్మేసిన భైరవకోన.. ఫస్ట్ డే కంటే ఎక్కువగా.. 2 రోజుల్లో ఎంతంటే!

టాలీవుడ్‌లో జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో ప్రత్యేకతను చాటుకుంటోన్న వాళ్లు మాత్రం కొందరే ఉన్నారు. అలాంటి వారిలో సందీప్ కిషన్ ఒకడు. రిజల్ట్ ఎలా ఉన్నా ప్రయోగాలు చేస్తోన్న అతడు తాజాగా 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. ముఖ్యంగా రెండో రోజు ఇది మరింతగా రాణించింది. మరి సందీప్ 'ఊరు పేరు భైరవకోన' 2 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

భైరవకోన నుంచి సందీప్:టాలెంటెడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ తీసిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో కనిపించారు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie 2 Days Worldwide Collections

సందీప్ మూవీ బిజినెస్ ఇలా:సందీప్ 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

2వ రోజు తెలుగులో వసూళ్లు:వీఐ ఆనంద్ - సందీప్ కిషన్ కాంబినేషన్‌లో విభిన్నమైన కాన్సెప్టుతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు అంతకు మించిన స్పందననే అందుకుంది. ఫలితంగా శనివారం ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.65 కోట్లు షేర్, రూ. 3.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే:వైవిధ్యమైన కథతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి రెండు రోజుల్లో భారీగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 1.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 40 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 1.65 కోట్లు రాబట్టింది. ఇలా 2 రోజుల్లో ఈ సినిమా రూ. 3.75 కోట్లు షేర్, రూ. 7.15 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie 2 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ. 3.75 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 1.10 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 2 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.85 కోట్లు షేర్‌, రూ. 9.45 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?:క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు దీనికి రూ. 4.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 6.15 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X