Ooru Peru Bhairavakona Collections: సందీప్‌కు సండే లక్.. 3 రోజుల్లోనే అన్ని కోట్లు.. హిట్ కావాలంటే!
సుదీర్ఘ కాలంగా విజయాన్ని అందుకోలేకపోతున్నా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇలా ఈ మధ్య కాలంలో పలు సినిమాలు చేశాడు. కానీ, హిట్ మాత్రం రాలేదు. అయినా జోష్ కోల్పోకుండా ఇప్పుడు 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా సండే మంచి వసూళ్లను అందుకుంది. మరి సందీప్ 'ఊరు పేరు భైరవకోన' 3 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి!
థ్రిల్లర్ మూవీతో సందీప్ రాక
వీఐ ఆనంద్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలు చేశారు.

సందీప్ మూవీ బిజినెస్ ఇలా
సందీప్ నటించిన 'ఊరు పేరు భైరవకోన'కు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.
3వ రోజు తెలుగులో వసూళ్లు
విభిన్నమైన కాన్సెప్టుతో టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ హీరోగా, వీఐ ఆనంద్ తెరకెక్కించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. రెండో రోజు అంతకు మించిన స్పందననే అందుకుంది. మూడో రోజూ అదే హోల్డ్ కనబర్చింది. ఫలితంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.65 కోట్లు షేర్, రూ. 3.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.
3 రోజుల్లో ఎంత వచ్చింది?
సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి మూడు రోజుల్లో భారీగానే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 2.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 54 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 2.44 కోట్లు రాబట్టింది. ఇలా 3 రోజుల్లో ఈ సినిమా రూ. 5.40 కోట్లు షేర్, రూ. 10.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.40 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 1.45 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 3 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.85 కోట్లు షేర్, రూ. 20.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.
టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
హర్రర్ జోనర్‌లో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో దీనికి రూ. 6.85 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 4.15 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.


Click it and Unblock the Notifications











