Ooru Peru Bhairavakona Collections: సగానికి సగం డౌన్.. 4 రోజుల్లో ఊహించని వసూళ్లు.. హిట్ కావాలంటే!
తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు ఫ్లాపులను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే టాలెంటెడ్ అండ్ యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతోన్న అతడు.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో వచ్చాడు.
దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది డౌన్ అయింది. మరి సందీప్ 'ఊరు పేరు భైరవకోన' 4 రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి!

క్రేజీగా ఊరు పేరు భైరవకోన: సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో నటించారు.

సందీప్ మూవీ బిజినెస్ ఇలా: క్రేజీ స్టోరీతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన'కు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

4వ రోజు భారీగా తగ్గాయిగా: సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో హర్రర్ అండ్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నాలుగో రోజు రెస్పాన్స్ భారీగా తగ్గిపోయింది. ఫలితంగా ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 85 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. వరల్డ్ వైడ్‌గా రూ. 95 లక్షలు వరకూ రాబట్టింది. ఇలా 4 రోజుల్లోనే రూ. 7.70 కోట్లు వరకూ వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











