Ooru Peru Bhairavakona Collections: 11 కోట్లు వస్తే హిట్.. వారంలో ఊహించని వసూళ్లు..!

టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన ఫలితాలను రాబట్టలేకపోతున్న హీరోలు కొందరు ఉన్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ సారి పక్కా ప్లానింగ్‌తో 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా లభించింది. కానీ, వీక్ డేస్‌లో మాత్రం ఇది డౌన్ అయింది. మరి సందీప్ 'ఊరు పేరు భైరవకోన' మొదటి వారం రోజుల కలెక్షన్లను మీరే చూసేయండి!

భయపెట్టేలా భైరవకోన మూవీ
సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమానే 'ఊరు పేరు భైరవకోన'. ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు.

 Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie 7 Days Worldwide Collections

సందీప్ మూవీ బిజినెస్ ఇలా
హర్రర్ స్టోరీతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన'కు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.

7వ రోజు తెలుగులో వసూళ్లు
టాలీవుడ్ టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్ హీరోగా, వీఐ ఆనంద్ తెరకెక్కించిన క్రేజీ మూవీ 'ఊరు పేరు భైరవకోన'కు మొదటి వీకెండ్ అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది క్రమంగా డౌన్ అవుతూ వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు డౌన్ అవుతున్నాయి. ఇలా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు రూ. 20 షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ రాబట్టింది.

 Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie 7 Days Worldwide Collections

7 రోజుల్లో ఎంత వచ్చింది?
సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి వారం రోజుల్లో డీసెంట్ రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 2.97 కోట్లు, సీడెడ్‌లో రూ. 70 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 3.11 కోట్లు రాబట్టింది. ఇలా 7 రోజుల్లో ఈ సినిమా రూ. 6.78 కోట్లు షేర్, రూ. 12.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఏడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.78 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 2.09 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 7 రోజుల్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.87 కోట్లు షేర్‌, రూ. 20.30 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
భయపెట్టే స్టోరీతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, వారం రోజుల్లో దీనికి రూ. 8.87 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 2.13 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X