Ooru Peru Bhairavakona Collections: 11 కోట్లు కావాలి.. ఫుల్ రన్‌లో అలా.. సందీప్ మూవీ హిట్టా ఫట్టా!

టాలీవుడ్‌లోని కొందరు హీరోలు ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ప్రయోగాలు చేస్తూ వెళ్తున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే స్టైల్‌లో సినిమాలను చేస్తోన్న అతడు.. ఆశించిన విజయాలను మాత్రం అందుకోవట్లేదు.

దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న లక్ష్యంతో 'ఊరు పేరు భైరవకోన' అనే మూవీ చేశాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా మంచిగానే లభించింది. ఈ నేపథ్యంలో 'ఊరు పేరు భైరవకోన' క్లోజింగ్ కలెక్షన్లను మీరే చూసేయండి!

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

భైరవకోన అంటూ ప్రయోగం: సందీప్ కిషన్ హీరోగా నటించిన ప్రయోగాత్మక చిత్రమే 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు. శేఖర్ చంద్ర దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

సందీప్ మూవీ బిజినెస్ ఇలా: సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన'కు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడైంది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 110.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ అయింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

అలాంటి టాక్‌తో రెస్పాన్స్: సందీప్ కిషన్ - వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన లభించింది. అయితే, రెండో వారం నుంచి ఈ మూవీకి రెస్పాన్స్ క్రమంగా తగ్గిపోతూ వచ్చింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

తెలుగులో ఎంత వచ్చింది?: విభిన్నమైన కథతో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి ఫుల్ రన్‌లో డీసెంట్ రెస్పాన్సే లభించింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లునే రాబట్టింది. దీంతో నైజాంలో రూ. 3.25 కోట్లు, సీడెడ్‌లో రూ. 83 లక్షలు, ఆంధ్రా మొత్తంలో కలిపి రూ. 3.36 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా ఈ సినిమా రూ. 7.44 కోట్లు షేర్, రూ. 14.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే: ఫుల్ రన్‌లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.44 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 2.33 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే మొత్తంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.77 కోట్లు షేర్‌, రూ. 22.25 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Closing Worldwide Collections

టార్గెట్ ఇలా.. నష్టం ఎంత?: యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 9.77 కోట్లు వచ్చాయి. అంటే రూ. 1.23 కోట్లు లోటుతో ఈ సినిమా ఏబో ఏవరేజ్‌గానే నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X