Ooru Peru Bhairavakona Collections: సందీప్ కిషన్ మూవీకి భారీ వసూళ్లు.. తొలి రోజు ఎన్ని కోట్లంటే!

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే హిట్లు కొడుతూ ముందుకు సాగుతుండగా.. మరికొందరు మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో సందీప్ కిషన్ ఒకడు. చాలా కాలంగా భారీ హిట్ కోసం చూస్తున్న అతడు తాజాగా 'ఊరు పేరు భైరవకోన' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీగానే లభించింది. దీంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. మరి సందీప్ 'ఊరు పేరు భైరవకోన' తొలి రోజు కలెక్షన్లను మీరే చూసేయండి మరి!

భయపెట్టేలా భైరవకోన మూవీ:
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రమే 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ తీసిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Day 1 Worldwide Collections

సందీప్ మూవీ బిజినెస్ ఇలా:
'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు కలిపి రూ. 4.40 కోట్లకు అమ్ముడుపోయింది. ఇలా ఈ సినిమాకు తెలుగులో రూ. 19.50 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.

అలాంటి టాక్‌తో భారీగానే:
ఆరంభంలోనే మంచి అంచనాలను ఏర్పరచుకుని 'ఊరు పేరు భైరవకోన' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీగానే లభించింది. దీంతో దీనికి ఓపెనింగ్స్ ఆశించినట్లుగా మంచిగానే వస్తాయని అంచనాలు వేశారు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Day 1 Worldwide Collections

తొలి రోజు తెలుగులో వసూళ్లు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే అందుకుంది. ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజు 'ఊరు పేరు భైరవకోన' సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.10 కోట్లు షేర్, రూ. 3.80 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 2.10 కోట్లు రాబట్టిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ ఆశించిన దానికి మించిన రెస్పాన్స్‌నే అందుకుంది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలుపుకుని ఇది రూ. 60 లక్షలు వసూలు చేసింది. వీటితో కలిపితే తొలి రోజు ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు షేర్‌, రూ. 6.03 కోట్లు గ్రాస్‌ రాబట్టింది.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Day 1 Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'ఊరు పేరు భైరవకోన' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 11 కోట్లుగా నమోదైంది. ఇక, మొదటి రోజు దీనికి రూ. 2.70 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 8.30 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X