Ooru Peru Bhairavakona: సందీప్ కిషన్ మూవీకి భారీ బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందంటే!

మంచి టాలెంట్ ఉన్నా.. ఆశించిన రీతిలో విజయాలను అందుకోలేక ఇబ్బంది పడుతోన్న టాలీవుడ్ హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. సుదీర్ఘ కాలంగా సినిమాలు చేస్తోన్న అతడు.. సక్సెస్‌లను మాత్రం సొంతం చేసుకోలేకపోతోన్నాడు. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే వెళ్తున్నాడు.

ఇలా ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకోవాలన్న కసితో 'ఊరు పేరు భైరవకోన' అనే సినిమాను చేశాడు. మిస్టరీ అండ్ హర్రర్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రానికి ఊహించని రీతిలో బిజినెస్ జరిగింది. మరి ఇది ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందో చూద్దామా!

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Pre Release Business Details

భైరవకోనలోకి సందీప్ కిషన్: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రమే 'ఊరు పేరు భైరవకోన'. వీఐ ఆనంద్ తీసిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలు చేశారు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Pre Release Business Details

అలాంటి కథతో విభిన్నంగా: భైరవకోన అనే గ్రామంలో జరిగిన మిస్టరీ నేపథ్యంలో 'ఊరు పేరు భైరవకోన' సినిమా రూపొందింది. గరుడ పురాణంలోని చివరి పేజీ ఉన్న ఊరిలో అతీత శక్తులు ఉండడం.. అక్కడికి హీరో వెళ్లి చిక్కుకోవడం.. తర్వాత అతడు ఆ ఊరిలోని రహస్యాలను చేధించడం అనే అంశాలతో దీన్ని తెరకెక్కించారు. ఇందులో భయానకమైన, ఆసక్తిని, హాస్యాన్ని ఇచ్చే సన్నివేశాలు పెట్టారు.

Sundeep Kishan Starrer Ooru Peru Bhairavakona Movie Pre Release Business Details

గ్రాండ్ రిలీజ్.. టాక్ అలాగే: ఎలాగైనా ఈ సారి విజయాన్ని సొంతం చేసుకోవాలని సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఎన్నో అంచనాలతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ఆరంభంలోనే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల నుంచి స్పందన కూడా లభిస్తోంది. ఇదే కంటిన్యూ అయితే కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది.

భైరవకోన ప్రీ బిజినెస్ ఇలా: థ్రిల్‌కు గురి చేసే కంటెంట్‌తో రూపొంది 'ఊరు పేరు భైరవకోన' మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో దీనికి అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా నైజాంలో రూ. 3.00 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.40 కోట్లు బిజినెస్ చేసింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ. 8.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే: వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' మూవీపై అందరిలో ఆసక్తి ఉంది. అందుకు తగ్గట్లే మార్కెట్ పరంగా ఇది బయ్యర్ల దృష్టిని ఆకట్టుకుంది. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్లకు అమ్ముడైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 10.20 కోట్లు బిజినెస్‌ను ఇది చేసుకుంది.

అన్ని కోట్లు వస్తేనే హిట్: సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు ఊహించని విధంగా రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 11.00 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే 'ఊరు పేరు భైరవకోన' సినిమా కమర్షియల్‌గా విజయం సాధిస్తుంది. మంచి టాక్ వస్తే.. ఈ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంటుందని చెప్పొకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X