A1 Express 2 Days Collections: రెండో రోజే తగ్గిన కలెక్షన్లు.. ఇంకా ఎంత వస్తే హిట్ అవుతుందంటే!

ఎన్ని సినిమాలు చేసినా.. సరైన ఫలితాలను ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. అప్పుడెప్పుడో అతడి కెరీర్ ఆరంభంలో వచ్చిన 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మొదటి విజయాన్ని అందుకున్న అతడు.. ఆ తర్వాత చాలా కాలానికి 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, ఆ తర్వాత కూడా అతడి పరిస్థితి ఏమంత బాగోలేదు. ఇలాంటి సమయంలో 'A1 ఎక్స్‌ప్రెస్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును ఓ సారి చూద్దాం పదండి!

ముదురు భామ అందాలు మాములుగా లేవు: మాల్దీవుల్లో బాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకున్న సందీప్ కిషన్

స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకున్న సందీప్ కిషన్

ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో సందీప్ కిషన్ చేసిన సినిమానే 'A1 ఎక్స్‌ప్రెస్'. స్టోర్ట్స్ డ్రామాగా సాగే ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. మార్చి 5న రిలీజ్ అయింది.

మంచి టాక్‌తో మొదలైంది.. పాజిటివ్ రివ్యూ

మంచి టాక్‌తో మొదలైంది.. పాజిటివ్ రివ్యూ

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'A1 ఎక్స్‌ప్రెస్'కు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అలాగే, నటుడిగా, నిర్మాతగా సందీప్ కిషన్ ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు కూడా జరుపుకుంటోంది.

ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత? ఏరియాల ప్రకారం

ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత? ఏరియాల ప్రకారం

టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ మార్కెట్ కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

2వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

2వ రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?

మొదటి రోజు పర్వాలేదనిపించిన 'A1 ఎక్స్‌ప్రెస్' కలెక్షన్లు.. రెండో రోజు తగ్గాయి. శనివారం నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 8 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో మొత్తంగా 2వ రోజు ఈ సినిమాకు రూ. 68లక్షలు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?

2 రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?

విడుదలైన రోజు 'A1 ఎక్స్‌ప్రెస్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 76 లక్షలు వసూలు చేసింది. ఇక, రెండో రోజు 68 లక్షలు రాబట్టింది. అంటే రెండు రోజులకు మొత్తంగా రూ. 1.44 కోట్లు షేర్, రూ. 2.50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే సమయంలో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 2 లక్షలు వచ్చాయి. దీంతో మొత్తంగా రూ. 1.50 కోట్లు వచ్చి చేరాయి.

ఇంకా ఎంత వస్తే హిట్ అవుతుందో తెలుసా?

ఇంకా ఎంత వస్తే హిట్ అవుతుందో తెలుసా?

'A1 ఎక్స్‌ప్రెస్'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజుల్లో ఈ చిత్రం రూ. 1.50 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 3.50 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. ఆదివారం ఈ సినిమా కలెక్షన్లు కోటికి పైగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X