A1 Express 3 Days Collections: మోస్తరు స్పీడుతో వెళ్తోన్న A1 ఎక్స్‌ప్రెస్.. ఇంకా అంత వస్తేనే హిట్!
చాలా రోజుల క్రితమే సినిమాల్లోకి హీరోగా పరిచయం అయినప్పటికీ.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సరైన హిట్లు పడక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు టాలెంటెడ్ స్టార్ సందీప్ కిషన్. ఈ కారణంగానే అతడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయినప్పటికీ ఫలితం ఉండడం లేదు. దీంతో ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఆ మధ్య 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. కానీ, తర్వాత మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో 'A1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మూడు రోజుల బాక్సాఫీస్ రిపోర్టు మీకోసం!

తెలుగులోనే తొలిసారి అలాంటి కథతో వచ్చాడు
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే తొలిసారి హాకీ నేపథ్యంతో వచ్చిన చిత్రం 'A1 ఎక్స్‌ప్రెస్'. యూనివర్శల్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాను డెన్నిస్ జీవన్ కనుకొలను తెరకెక్కిస్తున్నాడు. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. మార్చి 5న రిలీజ్ అయింది.

అంతటా మంచి టాక్ వచ్చింది.. రివ్యూలు కూడా
టీజర్, ట్రైలర్‌తోనే 'A1 ఎక్స్‌ప్రెస్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే మొదటి ఆట నుంచే దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అలాగే, నటుడిగా సందీప్ కిషన్ ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ సంబరాలు కూడా జరుపుకుంటోంది.

ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత? ఎంత వస్తే హిట్ లెక్క?v
టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్ మార్కెట్ కొంచెం తక్కువే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

మూడో రోజు ఎక్కడ? ఎంత? వసూలు చేసింది?
రెండు రోజులు పర్వాలేదనిపించిన 'A1 ఎక్స్‌ప్రెస్' కలెక్షన్లు.. మూడో రోజు కొంత పెరిగాయి. ఆదివారం నైజాంలో రూ. 24 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6.10 లక్షలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో 3వ రోజు దీనికి రూ. 70లక్షలు షేర్, రూ. 1.24 కోట్లు గ్రాస్ వచ్చింది.

మూడు రోజులకు కలిపి సందీప్ ఎంత రాబట్టాడు?
'A1 ఎక్స్‌ప్రెస్' తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 76 లక్షలు, రెండో రోజు 68 లక్షలు, మూడో రోజు రూ. 70 లక్షలు రాబ్టటింది. అంటే మూడు రోజులకు మొత్తంగా రూ. 2.14 కోట్లు షేర్, రూ. 3.74 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అదే సమయంలో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 7 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 3 లక్షలు వచ్చాయి. దీంతో మొత్తంగా రూ. 2.24 కోట్లు షేర్, రూ. 4 కోట్లు గ్రాస్ వచ్చింది.

హిట్‌గా నిలవాలంటే ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి?
'A1 ఎక్స్‌ప్రెస్'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 2.24 కోట్లు వసూలు చేసింది. మరో రూ. 2.76 కోట్లు వసూలు చేస్తేనే ఇది హిట్ అయినట్లు లెక్క. అంటే లాంగ్ రన్‌లో సగాని కంటే ఎక్కువే వసూలు చేయాల్సి ఉంది. శుక్రవారం వరకూ అది రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











