A1 Express Closing Collections: హిట్ టాక్‌తో మొదలై నష్టాలతో ముగిసి.. బిజినెస్ ఎంత? వచ్చిందెంత?

చాలా రోజుల క్రితం టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్. తొలినాళ్లలో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో భారీ విజయాన్ని అందుకున్న అతడు.. మరో హిట్ కోసం చాలా కాలమే వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు చేసినా అతడికి ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే రెండేళ్ల క్రితం 'నిను వీడని నీడను నేనే'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇటీవలే 'A1 ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ క్లోజింగ్ కలెక్షన్ల రిపోర్టు మీకోసం!

తొలిసారి అలా వచ్చిన చిత్రమే ‘A1 ఎక్స్‌ప్రెస్'

తొలిసారి అలా వచ్చిన చిత్రమే ‘A1 ఎక్స్‌ప్రెస్'

సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రమే 'A1 ఎక్స్‌ప్రెస్'. తెలుగులోనే తొలిసారి హాకీ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా చేసింది. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెన్‌లతో కలిసి సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. హిప్ ఆప్ తమీజా సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం మార్చి 5న విడుదలైంది.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్?

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్?

మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ మార్కెట్ కొంచెం తక్కువని చెప్పాలి. కానీ 'A1 ఎక్స్‌ప్రెస్'కు మాత్రం భారీగా వ్యాపారం జరిగింది. దీనికి నైజాంలో రూ. 1.60 కోట్లు, సీడెడ్‌లో రూ. 50 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.30 కోట్లు, కర్నాటక, రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లో 20 లక్షలతో మొత్తంగా రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగినట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

హీరో కార్తికేయ లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్.. చావు కబురు చల్లగా సక్సెస్‌పై కన్నేసిన యువ హీరో (ఫొటోలు)

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది?

'A1 ఎక్స్‌ప్రెస్' హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలెక్షన్లు రాబట్టడంలో విఫలమైంది. దీంతో మొత్తంగా నైజాంలో రూ. 1.09 కోట్లు, సీడెడ్‌లో రూ. 37 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 55 లక్షలు, ఈస్ట్‌లో రూ. 38 లక్షలు, వెస్ట్‌లో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 34 లక్షలు, కృష్ణాలో రూ. 35 లక్షలు, నెల్లూరులో రూ. 23 లక్షలతో ఏపీ టీఎస్‌లో రూ. 3.58 కోట్లు షేర్, రూ. 6.39 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు

'A1 ఎక్స్‌ప్రెస్' తెలుగు రాష్ట్రాల్లో మంచి టాక్‌తో దూసుకుపోయింది. తద్వారా ముగింపు సమయానికి ఈ చిత్రం రూ. 3.58 కోట్లు షేర్, రూ. 6.39 కోట్లు గ్రాస్ రాబట్టింది. కర్నాటకతో పాటు రెస్టాఫ్ ఇండియాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 12 లక్షలు వసూళ్లను రాబట్టిందీ మూవీ. ఫలితంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.82 కోట్లు షేర్, రూ. 6.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

జాతి రత్నాలు సక్సెస్ మీట్: నవీన్ పోలిశెట్టి హ్యాపీ (ఫొటోలు)

బాక్సాఫీస్ రిపోర్టు.. ఎంత నష్టం వచ్చిందంటే?

బాక్సాఫీస్ రిపోర్టు.. ఎంత నష్టం వచ్చిందంటే?

'A1 ఎక్స్‌ప్రెస్'కు అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 4.60 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5 కోట్లుగా నమోదైంది. ఇక, మొత్తంగా ఈ చిత్రం రూ. 3.82 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 78 శాతం మాత్రమే రికవరీ చేయగలిగింది. ఫలితంగా ఈ సినిమాకు రూ. 1.18 కోట్లు నష్టం వచ్చింది. సందీప్ కిషన్‌కు నిరాశనే మిగుల్చుతూ హిట్ టాక్ వచ్చినా నష్టపోయిన చిత్రంగా మిగిలిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X