Gully Rowdy Day 2 collections: సందీప్‌ కిషన్‌కు బిగ్ షాక్.. సగానికి సగం పడిపోయిన కలెక్షన్స్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగిలిన వారిలో పలువురు సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తున్నా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. అలాంటి వారిలో సందీప్ కిషన్ ఒకడు. కెరీర్ మొత్తంలో రెండు మూడు హిట్లను మాత్రమే అందుకున్న అతడు.. ఇప్పటికీ సక్సెస్ కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో 'గల్లీ రౌడీ' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ రెండు రోజుల బాక్సాఫీస్ రిపోర్టును పరిశీలిద్దాం పదండి!

‘గల్లీ రౌడీ'గా వచ్చిన సందీప్ కిషన్

‘గల్లీ రౌడీ'గా వచ్చిన సందీప్ కిషన్

సందీప్ కిషన్ హీరోగా జీ నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చాడు.

పెరిగిన అంచనాలు.. బిజినెస్ ఇలా

పెరిగిన అంచనాలు.. బిజినెస్ ఇలా

సక్సెస్ కోసం వేచి చూస్తోన్న సందీప్ కిషన్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే కామెడీ మూవీలో నటించాడు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

రిలీజ్ భారీగా... రెండో రోజు తగ్గింది

రిలీజ్ భారీగా... రెండో రోజు తగ్గింది

భారీ ఆశలు, అంచనాల నడుమ 'గల్లీ రౌడీ' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, ఊహించని విధంగా మొదటి రోజు దీనికి మంచి స్పందనే వచ్చింది. అయితే, రెండో రోజు మాత్రం ప్రేక్షకులు దీన్ని చూసేందుకు అంతగా మొగ్గు చూపలేదు.

రెండో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

రెండో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

'గల్లీ రౌడీ' మూవీకి రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 10 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 33 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు

ఏపీ తెలంగాణలో పెద్దగా రాణించలేకపోయిన'గల్లీ రౌడీ' మూవీ.. రెండు రోజులకు కలిపి రూ. 94 లక్షలు షేర్, రూ. 1.52 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 1 లక్ష మాత్రమే కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 97 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

Recommended Video

Sundeep Kishan Road Show | A1 Express విజయ యాత్ర
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?

మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'గల్లీ రౌడీ' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, రెండు రోజులకు కలిపి కేవలం రూ. 97 లక్షలు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. మరో రూ. 2.03 కోట్లు రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X