Gully Rowdy Day 3 collections: మూడో రోజు సత్తా చాటిన సందీప్.. హిట్‌కు అన్ని కోట్ల దూరంలో!

టాలీవుడ్‌కు హీరోగా పరిచయమై చాలా కాలమే అవుతోన్నా.. పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు టాలెంటెడ్ గాయ్ సందీప్ కిషన్. సుదీర్ఘమైన కెరీర్‌లో 'వెంకటాద్రీ ఎక్స్‌ప్రెస్', 'నిను వీడని నీడను నేనే' వంటి హిట్లను మాత్రమే సొంతం చేసుకున్న అతడు.. పెద్దగా రాణించలేకపోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు పర్వాలేదనిపించినా బాక్సాఫీస్ ముందు మాత్రం సత్తా చాటలేకపోయాయి. భారీ హిట్ కోసం ఎప్పటి నుంచే వేచి చూస్తోన్న సందీప్ కిషన్ ఇటీవల నటించిన చిత్రమే 'గల్లీ రౌడీ'. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

‘గల్లీ రౌడీ'గా మారిన సందీప్ కిషన్

‘గల్లీ రౌడీ'గా మారిన సందీప్ కిషన్

సందీప్ కిషన్ - జీ నాగేశ్వర్‌రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గల్లీ రౌడీ'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పోరేషన్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ నటించింది. బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్‌లు కీలక పాత్రలను పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

పెరిగిన అంచనాలు.. బిజినెస్ ఇలా

పెరిగిన అంచనాలు.. బిజినెస్ ఇలా

విజయం వేచి చూస్తోన్న సందీప్ కిషన్.. ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'గల్లీ రౌడీ' అనే కామెడీ మూవీలో నటించాడు. టీజర్, ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

రిలీజ్ భారీగా... మళ్లీ పుంజుకుందిగా

రిలీజ్ భారీగా... మళ్లీ పుంజుకుందిగా

భారీ ఆశలు, అంచనాల నడుమ 'గల్లీ రౌడీ' మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ఆరంభంలో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమా భవితవ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే, ఊహించని విధంగా మొదటి రోజు దీనికి మంచి స్పందనే వచ్చింది. రెండో రోజు తగ్గినా.. మూడో రోజు మళ్లీ పుంజుకుని మంచి కలెక్షన్లనే అందుకుందీ చిత్రం.

మూడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

మూడో రోజు రెండు రాష్ట్రాల్లో ఎంత?

'గల్లీ రౌడీ' మూవీకి మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాణించింది. ఫలితంగా నైజాంలో రూ. 11 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 6 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 3 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. తెలుగు రాష్ట్రాల్లో రూ. 36 లక్షలు షేర్, రూ. 58 లక్షలు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు

ఏపీ తెలంగాణలో పెద్దగా రాణించలేకపోయిన'గల్లీ రౌడీ' మూవీ.. మూడు రోజులకు కలిపి రూ. 1.30 కోట్లు షేర్, రూ. 2.10 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో కేవలం రూ. 1 లక్ష మాత్రమే కలెక్ట్ చేసింది. వీటితో కలుపుకుంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. రూ. 1.34 కోట్లు షేర్, రూ. 2.20 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

Recommended Video

Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంతొస్తే హిట్?

మిగిలిన హీరోలతో పోలిస్తే సందీప్ కిషన్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయితే, 'గల్లీ రౌడీ' మూవీకి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.75 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, మూడు రోజులకు కలిపి కేవలం రూ. 1.34 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ చిత్రం.. మరో రూ. 1.66 కోట్లు రాబట్టాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X