Gadar 2 10 Days Collections: చరిత్ర సృష్టించిన గదర్ 2.. బాహుబలి రికార్డు ఔట్.. వందల కోట్ల లాభాలతో!
గతంలో కంటే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. దక్షిణాది చిత్రాల స్థాయి పెరగడంతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా హిందీ చిత్రాలకు ముఖం చాటేస్తున్నారు. ఫలితంగా అక్కడ అడపాదడపా హిట్లు వస్తున్నాయి. ఇలా ఈ ఏడాది 'పఠాన్' దుమ్ము దులపగా.. ఇప్పుడు బాక్సాఫీస్ బెండు తీస్తున్న చిత్రమే 'గదర్ 2'. క్రేజీ మూవీ సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా హిందీలో ఇది రికార్డులు క్రియేట్ చేస్తోంది. మరి 'గదర్ 2' 10 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి!
సూపర్ హిట్ మూవీకి సీక్వెల్: చాలా కాలంగా హిట్ కోసం వేచి చూస్తున్న సన్నీ డియోల్ నటించిన చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. దీన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రల్లో కనిపించారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: 'గదర్ 2' చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఫలితంగా సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మొదట్లో 2000 థియేటర్లలోనే విడుదలైన ఈ మూవీ ఇప్పుడు 3000లకు పైగా స్క్రీన్లలో ఆడుతుంది.
ఏ రోజు ఎంత వచ్చిందంటే:'గదర్ 2' మూవీకి టాక్‌ను బట్టి వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఇలా ఫస్ట్ డే రూ. 40.10 కోట్లతో రచ్చ లేపిన ఈ చిత్రం.. తర్వాత వరుసగా 2వ రోజు రూ. 43.08 కోట్లు, 3వ రోజు రూ. 51.70 కోట్లు, 4వ రోజు రూ. 38.70 కోట్లు, 5వ రోజు రూ. 55.40 కోట్లు, 6వ రోజు రూ. 32.37 కోట్లు, 7వ రోజు రూ. 23.28 కోట్లు, 8వ రోజు రూ. 20.50 కోట్లు, 9వ రోజు రూ. 31.07 కోట్లు, 10వ రోజు రూ. 38.90 కోట్లు రాబట్టింది.

10 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. 'ఓ మై గాడ్ 2' సినిమా నుంచి కఠినమైన పోటీ ఉన్నా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఇలా 10 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 375.10 కోట్లు నెట్‌తో పాటు రూ. 489 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.
ఏకంగా అన్ని కోట్లు లాభం: ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం పది రోజుల్లోనే ఏకంగా రూ. 489 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 399 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇదే కంటిన్యూ అయితే రూ. 500 కోట్లు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

బాహుబలి, దంగల్ అవుట్: 'గదర్ 2' మూవీకి పదో రోజు హిందీలో రూ. 38.90 కోట్లు నెట్ వసూలు అయింది. దీంతో 'బాహుబలి 2' పేరిట ఉన్న రికార్డు (34.50 కోట్లు)ను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించింది. అలాగే, హిందీలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో 'దంగల్' (374 కోట్లు నెట్)ను ఇది దాటేసి నాలుగో స్థానానికి చేరింది. దీనికంటే ముందు పఠాన్, బాహుబలి 2, కేజీఎఫ్ 2 చిత్రాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











