Gadar 2 19 Days Collections: బాహుబలి 2నే టార్గెట్.. అన్ని వందల కోట్లు ఔట్.. లాభాలతో పెను సంచలనం
సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరో సన్నీ డియోల్. అయితే, కొన్నేళ్లుగా ఆయనకు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నటించిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'గదర్ 2'. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ బెండు తీసేసే వసూళ్లతో సత్తా చాటుతోంది. ఇలా మూడో వారంలోనూ ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 19 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరే చూడండి మరి!
మరోసారి అలాంటి స్టోరీతోనే:బాలీవుడ్‌లో క్రేజీ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి:సన్నీ డియోల్‌కు ఈ మధ్య హిట్లు లేకపోవడంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. మొదట్లో 2500 థియేటర్లలోనే విడుదలైన ఈ మూవీ తర్వాత నుంచి 3500లకు పైగా స్క్రీన్లలో నడుస్తోంది.
ఏ రోజు ఎంత వచ్చిందంటే:'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే అదిరిపోయే టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు రూ. 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు రూ. 16.10, 18వ రోజు రూ. 4.60 కోట్లు, 19వ రోజు రూ. 5.10 కోట్లు రాబట్టింది.

19 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 'ఓ మై గాడ్ 2', 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. ఇలా 19 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 465.75 కోట్లు నెట్, రూ. 612 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం:యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 19 రోజుల్లోనే ఏకంగా రూ. 612 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 522 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ మరో వంద కోట్ల రూపాయల లాభాలనూ అందుకునే ఛాన్స్ ఉంది.

బాహుబలి 2నే నెక్ట్ టార్గెట్:సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ రూపొందించిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మూడో వారంలో కూడా ఈ మూవీ భారీ స్థాయిలోనే రాబడుతోంది. ఇలా ఇప్పటికే రూ. 465 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)ను దాటే దిశగా ముందుకు సాగుతోంది. హిందీలో 'పఠాన్' రూ. 543.50 కోట్లతో టాప్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











