Gadar 2 2 Weeks Collections: 90 కోట్ల సినిమా.. 2 వారాల్లోనే 500 కోట్లకు పైగా.. అన్ని వందల కోట్ల లాభం
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనుకునేవారు. కానీ, ఇప్పుడు సౌత్ సినిమాల రేంజ్ పెరగడంతో హిందీ చిత్ర పరిశ్రమ తేలిపోతోంది. దీంతో అక్కడ వంద కోట్ల సినిమాలు రావడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లోనే ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి సంచలనం సృష్టించింది 'గదర్ 2' మూవీ. సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ బెండు తీసే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇలా బాలీవుడ్‌లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలు 'గదర్ 2' రెండు వారాల్లో ఎంత రాబట్టిందో చూడండి!
గదర్ 2తో మాస్ కమ్‌బ్యాక్ : ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం చూస్తున్న సన్నీ డియోల్ నటించిన చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. దీన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను పోషించారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి : ఆరంభం నుంచే 'గదర్ 2' చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఫలితంగా సన్నీ డియోల్ నటించిన ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదట్లో 2000 థియేటర్లలోనే విడుదలైన ఈ మూవీ ఇప్పుడు 3000లకు పైగా స్క్రీన్లలో రన్ అవుతోంది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే : 'గదర్ 2' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. అలాగే, 8వ రోజు రూ. 20.50 కోట్లు, 9వ రోజు రూ. 31.07 కోట్లు, 10వ రోజు రూ. 38.90 కోట్లు, 11వ రోజు రూ. 13.50 కోట్లు, 12వ రోజు రూ. 12.10 కోట్లు, 13వ రోజు రూ. 10 కోట్లు, రూ. 14వ రోజు రూ. 8.40 కోట్లు నెట్‌ను వసూలు చేసింది.

2 వారాల్లో అన్ని కోట్లు ఔట్ : సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. 'ఓ మై గాడ్ 2' సినిమా నుంచి కఠినమైన పోటీ ఉన్నా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఇలా 14 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 419.10 కోట్లు నెట్‌తో పాటు రూ. 546 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం : పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం పది రోజుల్లోనే ఏకంగా రూ. 546 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 456 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఇదే కంటిన్యూ అయితే రూ. 500 కోట్లు లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది.

బాహుబలి తర్వాత స్థానం : హిందీ బెల్టులో 'గదర్ 2' మూవీకి అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఇలా కొన్ని రోజులు ఈ మూవీ 'బాహుబలి 2' రికార్డును సైతం బ్రేక్ చేసేసింది. అయితే, రెండో వారం కలెక్షన్లను చూస్తే మాత్రం ప్రభాస్ మూవీనే ముందుంది. రెండో వారంలో 'బాహుబలి 2' మూవీకి రూ. 143.25 కోట్లు వసూలు అవ్వగా.. 'గదర్ 2' సినిమా రూ. 134.47 కోట్లు కలెక్ట్ చేసి రెండో స్థానానికి చేరింది.


Click it and Unblock the Notifications











