Gadar 2 20 Days Collections: గదర్ 2 వీర బాదుడు.. అప్పుడే వందల కోట్లు.. ప్రమాదంలో బాహుబలి 2 రికార్డు
ఒకప్పుడు బాలీవుడ్ అంటే కలెక్షన్ల సునామీని సృష్టించే సినిమాలు వస్తుండేవి. అయితే, ఇప్పుడు దక్షిణాది పరిశ్రమల హవా పెరగడంతో హిందీ ఇండస్ట్రీ వెనుకబడిపోయింది. దీంతో అక్కడ పెద్దగా హిట్ చిత్రాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌కు ఊపిరిపోసిన సినిమానే 'గదర్ 2'. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న సన్నీ డియోల్ నటించిన ఈ మూవీ కలెక్షన్ల ఊచకోత కోస్తూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇలా మూడో వారంలో కూడా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 20 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!
ఆ హిట్ మూవీకి సీక్వెల్‌గానే:బాలీవుడ్‌లో స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రల్లో కనిపించారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి:చాలా కాలంగా సన్నీ డియోల్‌కు హిట్లు లేకపోవడంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. మొదట్లో 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లలో నడుస్తోంది.
ఏ రోజు ఎంత వచ్చిందంటే:'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో మొదటి వారంలో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు రూ. 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు రూ. 16.10, 18వ రోజు రూ. 4.60 కోట్లు, 19వ రోజు రూ. 5.10 కోట్లు, 20వ రోజు రూ. 8.75 కోట్లు రాబట్టింది.

20 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది సత్తా చాటింది. ఇలా 20 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 474.50 కోట్లు నెట్, రూ. 625 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 20 రోజుల్లోనే ఏకంగా రూ. 625 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 535 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది.

బాహుబలి 2కు చేరువగా:సన్నీ డియోల్ - అనిల్ శర్మ కాంబోలో వచ్చిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. మూడో వారంలో కూడా ఈ మూవీ భారీ స్థాయిలోనే రాబడుతోంది. ఇలా ఇప్పటికే రూ. 474 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)ను దాటే దిశగా ముందుకు సాగుతోంది. మరో 37 కోట్లు నెట్ వస్తే ప్రభాస్ మూవీ రికార్డు బ్రేక్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











