Gadar2 22 Days Collections: ప్రభాస్‌కు షాకిచ్చేలా.. 22 రోజుల్లోనే వందల కోట్లు.. అన్ని కోట్ల లాభాలా!

కొంత కాలంగా బాలీవుడ్‌లో భారీ సక్సెస్‌ఫుల్ చిత్రాలు పెద్దగా రావడం లేదు. దీంతో హిందీ పరిశ్రమలోని హీరోలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి కూడా పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'పఠాన్' ఇండస్ట్రీకి ఊపిరిపోసింది.

మళ్లీ చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌ రేంజ్‌ను పెంచిన చిత్రమే 'గదర్ 2'. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ సినిమా వసూళ్ల సునామీని సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇలా నాలుగో వారంలోనూ మంచి వసూళ్లతో సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 22 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా లుక్కేయండి!

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

గదర్ 2 అంటూ సెన్సేషన్: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా సినిమానే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రల్లో కనిపించారు.

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: ఈ మధ్య కాలంలో సన్నీ డియోల్‌కు హిట్ లేకపోవడంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లకు పెరిగింది.

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

ఏ రోజు ఎంత వచ్చిందంటే: సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. అలాగే, మూడో వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు రాబట్టింది. ఇక, 22వ రోజు కూడా మంచి స్పందనతో రూ. 5.20 కోట్లు నెట్ వసూళ్లను అందుకుంది.

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

22 రోజుల్లో అన్ని కోట్లు ఔట్: హిట్ కోసం ఎదురు చూస్తున్న సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది వేగంగానే దూసుకెళ్తోంది. ఇలా 22 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 487.65 కోట్లు నెట్‌, రూ. 639 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

ఏకంగా అన్ని కోట్లు లాభం: సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 22 రోజుల్లోనే ఏకంగా రూ. 639 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 549 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది.

Sunny Deol Starrer Gadar 2 Movie 22 Days Worldwide Box Office Collections

బాహుబలి 2కు 24 కోట్లు: సన్నీ డియోల్ - అనిల్ శర్మ కాంబోలో వచ్చిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 22 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 487.65 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)కు రూ. 24 కోట్ల దూరంలో ఉండిపోయింది. ఇదే ఊపు కంటిన్యూ అయితే హిందీలో టాప్‌లో ఉన్న 'పఠాన్' రికార్డూ దాటుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X