Gadar 2 23 Days Collections: చరిత్రకు అడుగు దూరం.. అప్పుడే అన్ని వందల కోట్లు.. ప్రభాస్‌కు షాక్ ఖాయం
చిత్ర రంగానికి సంబంధించి అన్ని భాషలకూ బాలీవుడ్‌ను పెద్దన్నగా చెప్పుకునేవారు. అయితే, ఇప్పుడు మాత్రం సౌత్ సినిమాల స్థాయి పెరగడంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా అక్కడ వంద కోట్ల సినిమాలు రావడమే కష్టంగా మారింది.
ఈ సమయంలో అంచనాలు లేకుండానే వచ్చి సెన్సేషన్ అయిన చిత్రమే 'గదర్ 2'. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ మూవీ రికార్డు కలెక్షన్లతో సత్తా చాటుతోంది. ఇలా నాలుగో వారంలోనూ అదిరిపోయే వసూళ్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 23 రోజుల రిపోర్టును మీరే చూడండి!

గదర్ 2తో బాలీవుడ్‌లో షేక్: సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా చిత్రమే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: సన్నీ డియోల్‌కు చాలా కాలంగా హిట్ లేకపోవడంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లలో రన్ అవుతోంది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే: సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. 2వ వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. అలాగే, 3వ వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు రాబట్టింది. ఇక, ఈ యాక్షన్ మూవీ 22వ రోజు రూ. 5.20 కోట్లు, 23వ రోజు రూ. 5.72 కోట్లు వసూలు చేసింది.

23 రోజుల్లో అన్ని కోట్లు ఔట్: సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి బాలీవుడ్‌ను షేక్ చేసేలా మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది భారీ వసూళ్లతో సత్తా చాటుతూనే ఉంది. ఇలా 23 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 493.37 కోట్లు నెట్, రూ. 646.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 23 రోజుల్లోనే ఏకంగా రూ. 646.20 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 556.20 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే చాన్స్ ఫుల్‌గా ఉంది.

500 కోట్లకు చేరువ.. రికార్డూ: సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ కాంబోలో వచ్చిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 23 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 493.37 కోట్లు వసూలు చేసింది. తద్వారా రూ. 500 కోట్లు నెట్ మార్కుకు చేరువగా వచ్చింది. అదే సమయంలో 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)కు కూడా ఈ చిత్రం మరింత చేరువగా వచ్చేసింది.


Click it and Unblock the Notifications











