Gadar 2 Movie 26 Days Collections: 90 కోట్లతో తీస్తే 665 కోట్లు ఔట్.. రాజమౌళికే షాక్ ఇచ్చేలా!
చాలా కాలం నుంచే బాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ దూసుకుపోతోన్నారు సీనియర్ హీరో సన్నీ డియోల్. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోవడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో ఉన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే 'గదర్ 2' అనే సినిమాతో వచ్చారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే విడుదలైన ఈ చిత్రం ఊహించని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' 26 రోజుల వసూళ్లను మీరే చూడండి!
బాలీవుడ్‌లో గదర్ 2 రచ్చ:సన్నీ డియోల్ నటించిన తాజా సినిమానే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి:సన్నీ డియోల్‌కు ఈ మధ్య కాలంలో మార్కెట్ తగ్గింది. దీంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు తగ్గట్లే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లలో రన్ అవుతోంది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే:'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలైంది. 2వ వారంలో ఇది రూ. 134.47 కోట్లు, 3వ వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు రాబట్టింది. ఇక, 22వ రోజు రూ. 5.20 కోట్లు, 23వ రోజు రూ. 5.72 కోట్లు, 24వ రోజు రూ. 7.80 కోట్లు, 25వ రోజు రూ. 2.50 కోట్లు, 26వ రోజు రూ. 2.60 కోట్లు రాబట్టింది.

26 రోజుల్లో అన్ని కోట్లు ఔట్:సన్నీ డియోల్ హీరోగా చేసిన 'గదర్ 2' మూవీకి బాలీవుడ్‌కు ఉత్సాహాన్ని ఇస్తూ మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది భారీ వసూళ్లతో సత్తా చాటుతూనే ఉంది. ఇలా 26 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 506.27 కోట్లు నెట్, రూ. 665 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం:సక్సెస్‌ఫుల్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 26 రోజుల్లోనే ఏకంగా రూ. 665 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 575 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే దిశగా దూసుకుపోతూనే ఉంది.

రాజమౌళి సినిమాకు చేరువ:సన్నీ డియోల్ - అనిల్ శర్మ కాంబినేషన్‌లో రూపొందిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 26 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 506.27 కోట్లు వసూలు చేసింది. 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)కు కూడా ఈ చిత్రం మరింత చేరువగా వచ్చేసింది. రెండు రోజుల్లో ఆ రికార్డును 'గదర్ 2' ఖతం చేస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











