Gadar 2 3 Weeks Collections: 80 కోట్ల సినిమా.. 3 వారాల్లో 635 కోట్లు.. ప్రభాస్ రికార్డు బద్దలైనట్లే!

ఒకప్పుడు అత్యంత భారీ హిట్లతో బాలీవుడ్‌లో హవాను చూపించి.. కొన్నేళ్లుగా విజయాన్ని అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు సీనియర్ హీరో సన్నీ డియోల్. అయినప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే వచ్చారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో 'గదర్ 2' మూవీని చేశాడు. ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇలా మూడు వారాల్లో అదిరిపోయే వసూళ్లతో సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 21 రోజుల్లో ఎంత రాబట్టిందో మీరు కూడా చూసేయండి!

'గదర్ 2'తో వచ్చిన సన్నీ: సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన తాజా సినిమానే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు.

Sunny Deol

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి: సన్నీ డియోల్‌కు ఈ మధ్య కాంలో హిట్ లేకపోవడంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ తర్వాత 3500లకు పైగా స్క్రీన్లకు పెంచుకుంది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే: 'గదర్ 2' మూవీకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు బాగా వస్తున్నాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలు అయింది. రెండో వారంలో ఇది రూ. 134.47 కోట్లు వసూలు చేసింది. ఇక, 15వ రోజు రూ. 7.10 కోట్లు, 16వ రోజు 13.75 కోట్లు, 17వ రోజు రూ. 16.10, 18వ రోజు రూ. 4.60 కోట్లు, 19వ రోజు రూ. 5.10 కోట్లు, 20వ రోజు రూ. 8.60 కోట్లు, 21వ రోజు రూ. 8 కోట్లు వసూలు చేసింది.

Sunny Deol

20 రోజుల్లో అన్ని కోట్లు ఔట్: బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీకి ప్రీమియర్స్ నుంచే అదిరిపోయే టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. బాలీవుడ్‌లో 'ఓ మై గాడ్ 2', సౌత్‌లో 'జైలర్' సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది దూసుకెళ్తోంది. ఇలా 21 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 482.35 కోట్లు నెట్‌, రూ. 635 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసుకుంది.

ఏకంగా అన్ని కోట్లు లాభం: యాక్షన్ జోనర్‌లో రూపొందిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 21 రోజుల్లోనే ఏకంగా రూ. 635 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 545 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 600 కోట్లకు పైగా లాభాలను అందుకునే చాన్స్ కనిపిస్తోంది.

Sunny Deol

బాహుబలి 2పైనే ఫోకస్: సన్నీ డియోల్ హీరోగా అనిల్ శర్మ తీసిన 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా మూడు వారాలు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 482.35 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)ను దాటే దిశగా ముందుకు సాగుతోంది. ఇదే ఊపు కంటిన్యూ అయితే హిందీలో టాప్‌లో ఉన్న 'పఠాన్' రికార్డూ బ్రేక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X