Gadar 2 Movie 30 Days Collections: 90 కోట్ల సినిమా.. వసూళ్లు వందల కోట్లలో.. RRR బడ్జెట్ కంటే ఎక్కువ
ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా ఉన్న సీనియర్ హీరోలు భారీ హిట్లను అందుకుంటూ అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తున్నారు. తద్వారా తమలోని సత్తా ఇంకా తగ్గలేదని నిరూపిస్తున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఒకరు. చాలా కాలంగా సక్సెస్‌కు దూరంగా ఉన్న ఆయన ఇటీవలే 'గదర్ 2'తో వచ్చి సంచలనం సృష్టించారు. ఈ చిత్రం వందల కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ బెండు తీసేసింది. తద్వారా ఎన్నో రికార్డులను కూడా తిరగరాసింది. ఈ నేపథ్యంలో 'గదర్ 2' మూవీ 30 రోజుల్లో ఎంత రాబట్టింది? లాభాలు ఎంత సాధించింది? మరే చూడండి!
గదర్ 2తో సన్నీ అరాచకంగా : సన్నీ డియోల్ నటించిన పిరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'గదర్ 2'. 'గదర్: ఏక్ ప్రేమ్ కథ'కు సీక్వెల్‌గా రూపొందిన ఈ మూవీని అనిల్ శర్మ తెరకెక్కించారు. ఇందులో అమీషా పటేల్, ఉత్కర్ష్ శర్మ, మనీష్ వధ్వాలు కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి అనిల్ శర్మ నిర్మించారు. దీనికి మిథూన్, మాంటీ శర్మ సంగీతాన్ని అందించారు.

అన్ని కోట్ల బిజినెస్‌తో వచ్చి : సన్నీ డియోల్‌కు హిట్లు లేకపోవడంతో మార్కెట్ తగ్గింది. దీంతో 'గదర్ 2' చిత్రంపై ఆరంభంలో అంచనాలు పెద్దగా ఏర్పడలేదు. అందుకు తగ్గట్లే ఈ మూవీకి థియేట్రికల్ బిజినెస్ అనుకున్న రేంజ్‌లో జరగలేదు. ఫలితంగా ఈ చిత్రం రూ. 90 కోట్లు గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తోనే వచ్చింది. 2500 థియేటర్లలోనే వచ్చిన ఈ మూవీ ఆ తర్వాత 4500లకు పైగా స్క్రీన్లలో నడిచింది.

ఏ రోజు ఎంత వచ్చిందంటే : హిట్ కాంబినేషన్‌లో రూపొందిన 'గదర్ 2' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఫస్ట్ వీక్‌లో రూ. 284.43 కోట్లు నెట్ వసూలైంది. 2వ వారంలో ఇది రూ. 134.47 కోట్లు, 3వ వారంలో ఈ చిత్రం రూ. 63.35 కోట్లు, నాలుగో వారంలో రూ. 27.55 కోట్లు వసూలు చేసింది. ఇక, 29వ రోజు రూ. 90 లక్షలు, 30వ రోజు రూ. 1.45 కోట్లు నెట్ వసూలు చేసింది.

30 రోజుల్లో అన్ని కోట్లు ఔట్ : హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన 'గదర్ 2' మూవీకి బాలీవుడ్‌కు ఊపిరిపోసేలా మొదటి నుంచీ కలెక్షన్లు భారీగా దక్కుతున్నాయి. దీని తర్వాత విడుదలైన కొన్ని సినిమాల నుంచి పోటీ ఉన్నా ఇది నెల రోజులుగా భారీ వసూళ్లతో సత్తా చాటుతూనే వచ్చింది. ఇలా 30 రోజుల్లోనే 'గదర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 512.35 కోట్లు నెట్, రూ. 677 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

ఏకంగా అన్ని కోట్లు లాభం : సన్నీ డియోల్ నటించిన 'గదర్ 2' మూవీ రూ. 90 కోట్లు గ్రాస్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అలాంటిది ఈ చిత్రం 30 రోజుల్లోనే ఏకంగా రూ. 677 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు అప్పుడే రూ. 587 కోట్లు లాభాలు కూడా వచ్చాయి. అంటే మన RRR మూవీ బడ్జెట్ కంటే ఈ చిత్రానికి ఎక్కువ లాభాలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

షారూఖ్ రికార్డు దాటుతుందా : 'గదర్ 2' మూవీకి వసూళ్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఇలా 30 రోజులు పూర్తయ్యే సమయానికి ఈ సినిమా రూ. 512.35 కోట్లు వసూలు చేసింది. తద్వారా 'బాహుబలి 2' ఫుల్ రన్ కలెక్షన్ల (510.99 కోట్లు)ను కూడా ఈ చిత్రం దాటేసింది. ఇక, దీనికంటే ముందు 'పఠాన్' రూ. 543.50 కోట్లతో టాప్‌లో ఉంది. మరి ఫుల్ రన్‌లో ఈ రికార్డును సన్నీ మూవీ దాటుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











