QG Business: సన్నిలియోన్ మూవీకి భారీ బిజినెస్.. ప్రియమణి, జాకీ ష్రాఫ్ QG సినిమాకు ఫ్యాన్సీ రేటు
సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మాటల్లో చెప్పలేం. రేర్ కాంబినేషన్స్ వచ్చే సినిమాలపై ఆసక్తి, అంచనాలు భారీగా పెరిగిపోతుంటాయి. అలాంటి అరుదైన కాంబినేషన్ సినిమాకు బిజినెస్ కూడా భారీగానే జరుగుంది. ఆ రేర్ కాంబినేషన్ ఎవరు? ఎలాంటి బిజినెస్ జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..
రుషికేశ్వర్ ఫిల్మ్స్, ఫిల్మ్ నాటీ ఎంటర్‌టైన్‌మెంట్, వై స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన QG సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాను స్వర్గీయ ఎన్టీఆర్‌కు అత్యంత అప్తుడు ఎన్టీఆర్ శ్రీను సమర్పిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్, సెక్స్ బాంబ్ సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గాయత్రి సురేష్, ఎం వేణుగోపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఇక రుషికేశ్వర్ ఫిలింస్ బ్యానర్‌పై QG మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోవడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా చేశాయి. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ లభించింది చిత్ర యూనిట్ సభ్యులు అని తెలిపారు.
తెలుగు థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకొన్న నిర్మాత ఎం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా తమిళ నిర్మాతలకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. తెలుగు హక్కులకు భారీ పోటీ ఉన్నప్పటికీ.. మేము అడుగ్గానే మాకు ఫ్యాన్సీ రేటుకు ఇచ్చారు. టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది అని తెలిపారు.

ఇక ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున నటన హైలెట్. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచడమే కాకుండా భారీ సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు మీడియా ఆశీస్సుల ఉండాలని కోరుకొంటున్నాం అని అన్నారు.


Click it and Unblock the Notifications











