Sunny Sanskari Ki Tulsi Kumari Boxoffice: సన్నీ సంస్కారీకి తులసీకుమారి వసూళ్లు, జాన్వీ మూవీకి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, మెంటర్ డిసిపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై హిరూ యష్ జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అదర్ పూర్ణావాలా, శశాంక్ ఖైతాన్ నిర్మించిన చిత్రం సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి. బాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్లు జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ జంటగా నటించిన ఈ చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.
ప్రేమ కథా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, ఫన్, కామెడీ అంశాలను జోడించిన ఈ చిత్రంలో సాన్య మల్హోత్రా, రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్, రియా విజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు మనుష్ నందన్ సినిమాటోగ్రఫి, మనన్ సాగర్, చారుశ్రీ రాయ్ ఎడిటింగ్, జాన్ స్టివార్డ్ ఎడ్యూరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, తనిష్క్ బాగ్చీ, ఏపీఎస్, సచెత్ పరంపర, గురు రాంధ్వా తదితరులు పాటలు అందించారు. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్లు ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

సన్నీ సంస్కారీ కి తులసీ కుమారి మూవీకి దసరా హాలీడేస్ కలిసి వచ్చాయి. ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతున్నది. ఫస్ట్ డే రోజున ఉదయం ఆటలకు 20 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటలకు 40 శాతం, సాయంత్రం షోలకు 50 శాతం, రాత్రి షోలకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఇండియాలో ఫస్ట్ డే 9.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఇక రెండో రోజు కూడా ఈ చిత్రానికి పాజిటివ్ సిగ్నల్ అందుతున్నాయి. ఉదయం ఆటలకు 30 శాతం, మధ్యాహ్నం ఆటలకు 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. సాయంత్రం, రాత్రి ఆటలకూ కూడా మెరుగైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ మూవీ రెండో రోజు 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.
జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే.. 60 కోట్ల రూపాయలు వసూలు చేస్తే హిట్‌గా, 80 కోట్ల రూపాయలు రాబడితే.. సూపర్ హిట్‌గా మారే అవకాశం ఉంది. ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందనే విషయాన్ని కొన్ని రోజులు ఆగిస్తే స్పష్టమవ్వడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











