కలెక్షన్ రిపోర్ట్: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టిన ‘సూపర్ 30’
హృతిక్ రోషన్ మూవీ 'సూపర్ 30' బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. జులై 12న విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా కాస్త స్లోగా మొదలైనా... శని, ఆదివారాల్లో అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల మార్కును అందుకుంది.
'సూపర్ 30' చిత్రం తొలి రోజు రూ. 11.83 కోట్లు రాబట్టింది. హృతిక్ రోషన్ లాంటి స్టార్‌కు ఇది గ్రేట్ స్టార్ట్ కాదు. అయితే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రెండో రోజైన శనివారం రూ. 18.19 కోట్లు వసూలు చేసింది. మూడో రోజైన ఆదివారం రూ. 20 కోట్లకుపైగా రాబట్టినట్లు అంచనా. దీంతో ఫస్ట్ వీకెండ్ రూ. 50 కోట్ల మార్కును అందుకుంది.

'కబీర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ మూవీ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ... అది విడుదలైన మూడు వారాలు దాటడంతో 'సూపర్ 30' మంచి బిజినెస్ చేసింది. అయితే సోమవారం నుంచి కమర్షియల్ సర్క్యూట్‌లో రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది.
ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. 'సూపర్ 30' కథ విషయానికొస్తే... ఆనంద్ కుమార్ 'సూపర్ 30' అనే ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తూ ఏటా 30 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఐఐటీలో సీటు దక్కేలా చేస్తున్నాడు. తన కెరీర్లో ఎంతో మంది పేదల ఐఐటి కల సాకారం చేసిన అతడి జీవితాన్నే సినిమాగా తీశారు.


Click it and Unblock the Notifications











