Super Girl Box Office Report: అత్యంత దారుణంగా సూపర్ గర్ల్ కలెక్షన్లు.. ఎన్ని వేల కోట్ల నష్టమంటే?
సూపర్ హీరో పాత్రలతో రూపొందిన సినిమాలను అందించిన డీ యూనివర్స్ నుంచి భారీ అంచనాలతో వచ్చిన సూపర్ ఉమెన్ మూవీ సూపర్ గర్ల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్లను రాబడుతున్నది. ఇప్పటి వరకు డీసీ యూనివర్స్ నుంచి వచ్చిన క్యారెక్టర్లను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు క్రేగ్ గిలెప్సీ దర్శకత్వం వహించారు. సూపర్ గర్ల్‌గా మిల్లీ ఆల్‌క్లాక్ నటించారు. మ్యాథియాస్ షూనేర్ట్స్, ఈవ్ రిడ్లీ, డేవిడ్ క్రమ్‌హోల్ట్స్, ఎమిలీ బీచమ్, డేవిడ్ కారెన్ స్వెట్, జాసన్ మామో నటించారు. ఈ సినిమాను డీసీ స్టూడియోస్ బ్యానర్‌పై జేమ్స్ గన్, పీటర్ సఫ్రాన్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: రాబ్ హార్డీ, ఎడిటింగ్: తాతియానా ఎస్ రీజెల్, ఫ్రెడ్ రస్కిన్, మ్యూజిక్: క్లాడియా సార్న్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమాను ట్రోల్ కోర్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, ది సాఫ్రాన్ కంపెనీ బ్యానర్లపై రూపొందించారు. ఈ చిత్రం జూన్ 26, 2026 రోజున రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ చిత్రం ఇప్పటి వరకు వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హై టెక్నాలజీ వాల్యూస్‌తో రూపొందించిన సూపర్ గర్ల్ చిత్రాన్ని ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 170 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1607 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సుమారుగా 350 మిలియన్ డాలర్లుగా అంటే ఇండియన్ కరెన్సీలో 3308 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇండియాలో ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోవడం, ఈ మూవీ వస్తుందనే విషయం సూపర్ హీరో సినిమాల ఫ్యాన్స్‌కు తెలియకపోవడంతో పేలవంగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం తొలి రోజు 1.4 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.55 కోట్ల రూపాయలు, 3వ రోజు 1.4 కో ట్ల రూపాయలు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 30 లక్షలు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో ఈ సినిమాను వారం కంటే ముందే ఎత్తి వేశారు. దాంతో ఈ చిత్రం ఇండియాలో 5 కోట్ల మేర వసూళ్లను మాత్రమే సాధించింది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట పేలవమైన వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో 40 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. యూకే, ఐర్లాండ్, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రెజిల్, జపాన్, చైనాలో కలిపి 35 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస వద్ద సాధిస్తున్న కలెక్షన్ల వేగాన్ని చూస్తే.. ఈ చిత్రం లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్‌లో నార్త్ అమెరికాలో సుమారుగా 100 మిలియన్ డాలర్లు, ఓవర్సీస్‌తో కలిపి 200 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అంటే ఈ సినిమా సుమారుగా 120 మిలియన్ డాలర్లకుపైగా అంటే భారతీయ కరెన్సీలో 1134 కోట్ల నష్టాన్ని చవి చూస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత క్షీణిస్తే ఇంకా భారీగా నష్టాలు వాటిల్లుతాయని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications


