మరోసారి దుమ్మురేపుతోన్న గుంటూరు కారం .. ఫస్ట్ రిలీజ్‌కి మించి
సినీ పరిశ్రమ విచిత్రమైనది.. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో? ఏ సినిమాను జనం ఆదరిస్తారో అర్ధం కాదు. కంటెంట్ బాగుండి ఖచ్చితంగా హిట్ అవుతాయనుకున్న సినిమాలను కొన్నిసార్లు జనం పట్టించుకోరు. థియేటర్‌లో ఫెయిలైన ఈ సినిమాలు టీవీ, ఓటీటీలలో దుమ్మురేపుతాయి. ఇలాంటి పరిస్ధితి ఎన్నో చిత్రాలకు, ఎందరో హీరోలకు ఎదురైంది. ఈ లిస్ట్‌లోకే వస్తుంది గుంటూరు కారం.
సూపర్‌స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేశ్‌కు అతడు , ఖలేజా వంటి మెమొరబుల్ హిట్స్‌ను అందించారు త్రివిక్రమ్ . దాదాపు దశాబ్ధం గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమే గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. కానీ సరైన ప్రమోషన్స్ లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే టోటల్ రన్‌లో రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను అందుకుని రూ.133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో రూ. 115 కోట్లు మాత్రమే రికవరీ చేసి నష్టాలను మూటకట్టుకుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నేపథ్యంలో న్యూఇయర్ కానుకగా గుంటూరు కారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా బుకింగ్స్ ప్రారంభమైన క్షణాల్లోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.
గుంటూరు కారంతో మహేశ్ పలు రికార్డులను నెలకొల్పారు. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ యూట్యూబ్‌లో ప్రపంచవ్యాప్తంగా 527 మిలియన్ల వ్యూస్ అందుకుంది. అలాగే ఈ సినిమా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 37.68 మిలియన్ వ్యూస్.. 665.8 వేల లైక్స్ రాబట్టి పుష్ప 2 ట్రైలర్ వచ్చే వరకు టాప్ ప్లేస్‌లో నిలిచింది.

థియేటర్‌లో ప్రేక్షకుల తిరస్కరణకు గురైనా ఓటీటీలో మాత్రం గుంటూరు కారం మంచి రెస్పాన్స్ అందుకుంది. టీవీల్లో కూడా ఈ సినిమాకు బుల్లితెర ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తొలిసారి గుంటూరు కారం టెలికాస్ట్ అయినప్పుడు 9.2 టీఆర్పీ రేటింగ్ నమోదు కాగా.. రెండోసారి 6.13 రేటింగ్ వచ్చింది.
తెలుగులో ఓకే కానీ.. తమిళ బుల్లితెరపై గుంటూరు కారం రేర్ ఫీట్ అందుకుంది. తొలిసారి టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు 4.5 టీఆర్పీ రేటింగ్ తెచ్చుకున్న మహేశ్ బాబు మూవీ సెకండ్ టైమ్ ఆశ్చర్యకరంగా 4.73 టీఆర్పీ పాయింట్స్ అందుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా రెండోసారి టెలికాస్ట్ చేస్తే జనం నుంచి రెస్పాన్స్ అంతగా ఉండదు.
కానీ రెండోసారి , అది కూడా మహేశ్‌కు ఫ్యాన్ బేస్ అంతగా లేని తమిళనాడులో ఈ స్టాయి టీఆర్పీ రేటింగ్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక తమిళ చిత్రాలను కూడా టీవీలలో ఎక్కువ మంది చూడటం లేదు. అలాంటి టైంలో డబ్బింగ్ చిత్రమైన గుంటూరు కారంకి మంచి టీఆర్పీలు రావడం విశేషం. దీంతో మహేశ్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











