ఓవర్సీస్‌లో కాలా కలెక్షన్ల హోరు.. మలేషియాలో దడదడ!

By Rajababu

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వచ్చిన కాలా చిత్రం ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రాబడుతున్నది. ఈ చిత్రం మలేషియాలో రికార్డు వసూళ్లను సొంతం చేసుకొన్నది. యూఎస్, ఆస్ట్రేలియాలో సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ చిత్రం తొలివారం ముగిసేటప్పటికీ 112.2 కోట్లు సాధించింది. రిలీజ్‌కు పలు హక్కుల అమ్మకాల ద్వారా ఈ చిత్రం రూ.230 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్‌లో కాలా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

మలేషియాలో రికార్డు కలెక్షన్లు

మలేషియాలో రికార్డు కలెక్షన్లు

మలేషియాలో రజనీకాంత్‌ చిత్రాలకు మంచి ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. హిట్టు, ఫ్లాప్ తేడా లేకుండా రికార్డు కలెక్షన్లు నమోదవుతుంటాయి. మిశ్రమ స్పందన వ్యక్తమైన కాలా చిత్రం కూడా మంచి వసూళ్లను సాధించింది. తొలివారంలో రూ.7.61 కోట్లు వసూలు చేయడం ఓ రికార్డుగా మారింది.

 యూఎస్‌లో వసూళ్లు

యూఎస్‌లో వసూళ్లు

అమెరికాలో కూడా మంచి కలెక్షన్లను కాలా చిత్రం సాధిస్తున్నది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం రూ.13.5 కోట్లు వసూళు చేసే అవకాశం ఉంది. యూఎస్‌లొ ఇంకా ప్రేక్షకాదరణ పెరుగుతుండటం రజనీ స్టామినాకు అద్దం పట్టింది

చెన్నై లో రికార్డులు

చెన్నై లో రికార్డులు

ఇక చెన్నైలో ఈ చిత్రం తొలివారంలో రూ.8.24 కోట్లు కొల్లగొట్టింది. తొలిరోజున రూ.1.76, రెండో రోజున రూ.1.44, మూడో రోజున రూ.1.70 కోట్ల, నాలుగో రోజున రూ.1.74 కోట్లు, ఐదో రోజున రూ.0.59 లక్షలు, ఆరో రోజున రూ.56 లక్షలు, ఏడో రోజున 45 లక్షల రూపాయలను కలెక్ట్ చేసింది.

కార్తీక్ సుబ్బరాజుతో రజనీకాంత్ బిజీగా

కార్తీక్ సుబ్బరాజుతో రజనీకాంత్ బిజీగా

కాలా రిలీజ్ రోజునే మరో చిత్రాన్ని పట్టాలెక్కించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇక వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆలరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నది. కార్తీక్ సుబ్బరాజుతో సినిమా తర్వాత దర్శకుడు ఏఆర్ మురుగదాస్ రూపొందించే చిత్రంలో రజనీకాంత్ నటించనున్నారనే వార్త తమిళ మీడియాలో వైరల్ అయింది.

 మురగదాస్‌తో రజనీకాంత్ చిత్రం

మురగదాస్‌తో రజనీకాంత్ చిత్రం

సామాజిక సందేశంతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా మురుగదాస్‌కు పేరున్నది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ క్రేజ్ తగిన స్టోరిని మురగదాస్ సిద్దం చేసినట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు.

రిలీజ్‌కు రోబో సిద్ధం

రిలీజ్‌కు రోబో సిద్ధం

కాలా తర్వాత రజనీకాంత్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన 2.0 చిత్రం త్వరలోనే విడుదల కానున్నది. రోబో2 చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రం ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X