Vettaiyan Advance Booking : ఓవర్సీస్‌లో వెట్టయాన్‌ కలెక్షన్ల వేట .. అడ్వాన్స్ బుకింగ్‌తో ఎన్ని కోట్లంటే?

జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన మూవీ వెట్టయాన్. ఇది తలైవా కెరీర్‌లో 170వ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన వెట్టయాన్‌లో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీతో అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు సూపర్‌స్టార్లు ఎలా నటించారు.. వారి క్యారెక్టర్లు ఏంటనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు వెట్టయాన్‌పై హైప్‌ను భారీగా పెంచేశాయి.

super star rajinikanth s Vettaiyan Crossed Million Dollar Mark with Pre-Sales in overseas here s the details

వెట్టయాన్‌లో అమితాబ్‌తో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రెడ్ జెయింట్ సంస్థ దక్కించుకోగా.. ఓవర్సీస్‌లో లైకా ప్రొడక్షన్స్ ఓన్‌గా రిలీజ్ చేస్తోంది. కేరళలో శ్రీ గోకులం మూవీస్ వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడ రజనీ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది. రజనీ గత చిత్రం జైలర్ తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించింది.

ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేసిన అనిరుధ్ రవిచందర్ .. వెట్టయాన్‌కు బ్లాక్‌బస్టర్ స్టాంప్ వేయడంతో ఈ సినిమా హిట్ అని రజనీ ఫ్యాన్స్ బల్లగుద్ధి చెబుతున్నారు. రిలీజ్‌కు ముందు అనిరుధ్ బ్లాక్‌బస్టర్ అని చెప్పిన జైలర్, జవాన్, లియో, దేవర సినిమాలు సూపర్‌హిట్ అవ్వడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు వెట్టయాన్ విషయంలోనూ అదే నిజమవుతుందని తలైవా ఫ్యాన్స్ అంటున్నారు.

రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగ రోజు. ఆయన సినిమా కోసం గతంలో పలు ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా వెట్టయాన్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. ప్రీ సేల్స్‌లో రజనీ దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో సూపర్‌స్టార్ మేనియా ఓ రేంజ్‌లో ఉంది. అక్కడ ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మీడియాలో వస్తున్న సమాచారాన్ని బట్టి ఓవర్సీస్‌లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాడు వెట్టయాన్. రిలీజ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటం, దసరా సీజన్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X