Vettaiyan Day 1 Collection : వేట్టయన్‌కి షాకిచ్చిన హిందీ జనాలు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత దారుణంగానా?
జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్ ది హంటర్ . ఇది తలైవా కెరీర్‌లో 170వ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్న విధంగానే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ ఓ మార్కెట్ చోట మాత్రం రజనీకాంత్‌కి దెబ్బేసింది. ఈ వివరాల్లోకి వెళితే :
వేట్టయన్‌లో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత ఇద్దరు సూపర్‌స్టార్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు. టీజర్, ట్రైలర్లతో భారీ హైప్ తెచ్చుకున్న ఈ మూవీ కోసం తలైవా అభిమానులు ఎగబడ్డారు. ఓవర్సీస్‌లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టిన రజనీ తన స్టామినా ఏంటో చూపించారు.

వేట్టయన్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. తమిళనాడులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.73 కోట్లకు అమ్ముడవగా.. తెలుగులో రూ.17 కోట్లు, కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ రూ.25 కోట్లతో పాటు ఓవర్సీస్‌లో రూ.45 కోట్ల మేర జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌లో వేట్టయన్ రూ.160 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.160 కోట్ల షేర్ , రూ.320 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి.
తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే .. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో వేట్టయన్‌కు బుకింగ్స్ బాగానే జరిగి సాలీడ్ ఓపెనింగ్స్ రాబట్టాడు వేట్టయన్. ఫస్ట్ డే తమిళ్‌లో రూ.22 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో 3.5 మిలియన్లను రాబట్టింది. ఒక్క ఓవర్సీస్‌లోనే తొలి రోజు రూ.25 కోట్ల గ్రాస్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా వేట్టయన్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రూ.72 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇళయదళపతి విజయ్ నటించిన ది గోట్‌కు ఫస్ట్ డే రూ.126 కోట్ల వసూళ్లు రాగా.. ఆ మూవీతో పోల్చితే వేట్టయన్‌కు రూ.54 కోట్లు తక్కువగా కలెక్షన్స్ రావడం తలైవా అభిమానులను నిరాశ పరిచింది.

అయితే హిందీ మాత్రం వేట్టయన్‌కు షాకిచ్చింది. మంచి రివ్యూలు వచ్చినప్పటికీ హిందీ వెర్షన్‌లో తొలి రోజు వేట్టయన్ కేవం రూ.6 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రజనీ గత చిత్రం జైలర్, విజయ్ ది గోట్ చిత్రాలతో వేట్టయన్‌ను పోల్చి చూస్తున్నారు. కాకపోతే హిందీ మార్కెట్‌లో రిలీజైన తమిళ్ వెర్షన్‌తో రూ.60 లక్షల వసూళ్లను తలైవా సాధించాడు. మొదటి రోజు కలెక్షన్స్‌లో జైలర్ (రూ.35 లక్షలు)ను వెనక్కినెట్టినప్పటికీ.. విజయ్ ది గోట్ ఓపెనింగ్స్ (రూ.1.85 కోట్లు)ను వేట్టయన్ టచ్ చేయలేకపోయాడు. పండుగ సెలవులు, లాంగ్ వీకెండ్ కారణంగా హిందీలోనూ పుంజుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











