Sueprman Box Office: వరల్డ్ వైడ్ 4 రోజుల్లో 2000 కోట్లు.. సూపర్‌మ్యాన్‌కు ఇండియాలో ఎన్ని కోట్లంటే?
DC కామిక్స్ నుంచి వచ్చిన అద్బుతమైన అమెరికన్ సూపర్ హీరో క్యారెక్టర్ సూపర్ మ్యాన్. డీసీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. సూపర్ మ్యాన్ సిరీస్‌లో ఇది రెండో రీబూట్ చిత్రం. సూపర్ మ్యాన్‌గా డేవిడ్ కోరెన్‌స్వెట్ నటించాడు. ఈ చిత్రంలో రాచెల్ బ్రోస్నన్, నికోలాస్ హాల్ట్, ఇడీ గాథేజీ, ఆంథోని కారిగన్, నాథన్ ఫిల్లియాన్, ఐసాబెల్లా మెర్సిడ్ తదితరులు నటించారు. ఈ సిిమాకు హెన్రీ బ్రాహమ్ సినిమాటోగ్రఫి, విలియమ్ హాయ్, క్రెయిగ్ అల్పర్ట్ ఎడిటింగ్, జాన్ మర్పీ, డేవిడ్ ఫ్లేమింగ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా అమెరికాతోపాటు పలు దేశాల్లో జూలై 11వ తేదీన రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
సూపర్‌మ్యాన్ సినిమాను పాపులర్ యాక్టర్లతో, టెక్నికల్‌గా చాలా పకడ్బందిగా నిర్మించారు. ఈ చిత్రం కోసం ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. అయితే ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నిషియన్ల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 225 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 1900 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సూపర్‌మ్యాన్ సినిమా ఏ రూపంలో వచ్చినా.. ఎలాంటి కంటెంట్‌తో వచ్చినా ఆ ఫ్రాంచైజీకి భారీ క్రేజ్ ఉంటుంది. డీసీ యూనివర్స్‌లో వచ్చిన ఈ సినిమాకు ఇండియాలోను, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన కనిపించింది. జురాసిక్ వరల్డ్ రీబర్త్, అలాగే ఎఫ్1 సినిమాలతో పోటీ పడుతూ రికార్డు స్థాయి కలెక్షన్లను ఉత్తర అమెరికాలోను, అలాగే ఓవర్సీస్‌లోను నమోదు చేసింది.
సూపర్‌మ్యాన్ సినిమా ఇండియాలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు 7.75 కోట్ల రూపాయలు, రెండొ రోజు 10 కోట్ల రూపాయలు, మూడో రోజు 9.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ సినిమా 27.25 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఇంగీష్ వెర్షన్ 18.4 కోట్ల రూపాయలు, తెలుగు వెర్షన్ 1.1 కోట్ల రూపాయలు, తమిళ వెర్షన్ 1.05 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ చిత్రం 4వ రోజున వసూళ్లు భారీగా క్షీణించాయి. క్రితం రోజుతో పోల్చుకొంటే ఈ సినిమా దాదాపు 50 శాతం మేర తగ్గే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండియాలో 4 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. ఈ సినిమా గత నాలుగు రోజుల్లో 32 కోట్ల మేర ఇండియాలో నెట్ వసూళ్లు, 38 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని సాక్ నిల్క్ వెల్లడించింది.
ఇదిలా ఉండగా, సూపర్‌మ్యాన్ సినిమా గత మూడు రోజుల్లో అమెరికాలో 125 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1075 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 100 మిలియన్ డాలర్లు అంటే.. ఇండియన్ కరెన్సీలో 860 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా దాదాపు 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











