Superman Collections: 9 రోజుల్లోనే 2600 కోట్లు... ఇండియాలో సూపర్‌మ్యాన్‌కు ఎన్ని కోట్లు వసూలైదంటే?
జూలై 11న విడుదలైన హాలీవుడ్ చిత్రం సూపర్ మ్యాన్ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్ వద్ద వేల కోట్లల్లో వసూల్లు సాధిస్తోంది. అమెరికన్ సూపర్ హీరో చిత్రాన్ని డీసీ స్టూడియోస్ నిర్మించింది. జేమ్స్ గన్ దర్శకత్వం వహించడం విశేషం. సూపర్ మ్యాన్ సిరీస్‌లో ఇది రెండోది. సూపర్ మ్యాన్‌గా డేవిడ్ కోరెన్‌స్వెట్ నటించగా..రాచెల్ బ్రోస్నన్, నికోలాస్ హాల్ట్, ఇడీ గాథేజీ, ఆంథోని కారిగన్, నాథన్ ఫిల్లియాన్, ఐసాబెల్లా మెర్సిడ్ వంటి ప్రముఖులు ఇతర పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఓవర్సీస్ లో 9 రోజుల్లో ఎన్ని కోట్లు వసూల్ చేసింది? ఇక ఇండియాలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..
సూపర్ మ్యాన్ చిత్రం బడ్జెట్?
హాలీవుడ్ చిత్రాలకు సాధారణంగాను వేల కోట్లల్లోనే బడ్జెట్ వెచ్చిస్తుంటారు. అదే రేంజ్ లో అవుట్ పుట్ కూడా అందిస్తూ ఉంటారు. కాగా సూపర్ మ్యాన్ 3డీ చిత్రానికి కూడా డీసీ స్టూడియోస్ వాళ్లు భారీగానే ఖర్చు చేశారు. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, వీఎఫ్ఎక్స్, ప్రమోషన్స్ ఖర్చులతో కలిసి 225 మిలియన్ డాలర్లు వెచ్చించారు. ఇండియన్ కరెన్సనీలో రూ.1900 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

సూపర్ మ్యాన్ 7రోజులు ఓవర్సీస్ వసూళ్లు..
సూపర్ మ్యాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రానికి ఓవర్సీస్ లో మొదటి రోజు రూ.250 కోట్లు, 2వ రోజు రూ.150 కోట్లు, 3వ రోజు రూ.420 కోట్లు, రూ.30 కోట్లు, 5వ రోజు రూ.50 కోట్లు, 6వ+7వ రోజు కలిపి రూ.250 కోట్లు కలిపి ఇలా వారం రోజుల వరకు మాత్రం రూ.1150 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిల్క్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక 8వ, 9వ రోజుకు సంబంధించిన డేటాపై స్పష్టత లేదు.
సూపర్ మ్యాన్ ఇండియాలో 9 రోజుల వసూళ్లు..
ఇండియాలోనూ సూపర్ మ్యాన్ చిత్రం ప్రధాన భాషల్లో విడుదలైంది. ఇంగ్లీష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదలైన మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. 8వ రోజు ఈ చిత్రానికి రూ.1.9 కోట్ల నెట్, 9వ రోజు రూ.3.68 కోట్లు వసూల్ చేసింది. ఇక 9వ రోజు వరకు ఇండియాలో రూ.40.58 కోట్ల నెట్ వసూళ్లు, 46.65 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు చేసిందని సాక్ నిల్క్ గణాంకాలు తెలుపుతున్నాయి.
వరల్డ్ వైడ్ గా సూపర్ మ్యాన్ కలెక్షన్లు..
9 రోజులుగా సూపర్ మ్యాన్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా భారీగానే వసూళ్లు అందుతున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలుపుకొని మొత్తం రూ.2603.9 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిల్క్ బాక్సాఫీస్ రిపోర్ట్ లో వెల్లడించింది. ఇక చిత్రానికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ దక్కుతుండటంతో మున్ముందు ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











