ఒక్క ప్రసాద్ ఐమాక్స్‌లోనూ రూ. 7 కోట్లు వసూలు

By Srikanya

Superman : Man of Steel
హైదరాబాద్ : హాలీవుడ్‌లో జాక్‌స్నైడర్ దర్శకత్వంలో హెన్రీ కెవిల్ సూపర్‌మేన్‌గా నటించిన 'సూపర్‌మేన్ మ్యాన్ ఆఫ్ స్టీల్' చిత్రం 14న విడుదలన విడుదలైన సంగతి తెలిసిందే. సెన్సేషనల్ మూవీస్ పతాకంపై సినీ స్టార్ సమర్పణలో గోగినేని బాలకృష్ణ తెలుగులో అందించారు. ఈ చిత్రం ఇక్కడా సూపర్ కలెక్షన్స్ కురిపిస్తోంది.

ప్రసాద్ గ్రూప్స్ అధినేత అక్కినేని రమేశ్‌ప్రసాద్ మాట్లాడుతూ "హాలీవుడ్ తయారైన గొప్ప గొప్ప సినిమాల్ని ఐమాక్స్‌లో చూపించగలుగుతున్నాం. టెక్నాలజీ పూర్తి విలువ ఈ స్క్రీన్ మీదే తెలుస్తుంది. ప్రసాద్ ఐమాక్స్‌లో జేమ్స్ కామెరూన్ చిత్రం 'అవతార్'ను మూడు లక్షల మంది పైగా చూశారు. ప్రేక్షకుల పరంగా ఇది వరల్డ్ రికార్డ్. ఆ సినిమా ఒక్క ప్రసాద్ ఐమాక్స్‌లోనూ రూ. 7 కోట్లు వసూలు చేసింది. జాక్ స్నైడర్ రూపొందించిన 'మాన్ ఆఫ్ స్టీల్' గొప్ప చిత్రం. మంచికీ, చెడుకీ మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడూ మంచే గెలుస్తుందని మరోసారి చెప్పే ఈ సినిమాలో కేవలం యాక్షన్‌ని మాత్రమే కాక ఫ్యామిలీ స్టోరీనీ మిళితం చేశారు. మంచి కలెక్షన్లతో సినిమా నడుస్తోంది. మనం కలల్లో ఊహించే వాటిని తెరమీద చూపిస్తే ఎలా ఉంటుందో 'సూపర్‌మేన్ - మ్యాన్ ఆఫ్ స్టీల్' సినిమా అలా ఉంది'' అని చెప్పారు.

ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసిన సెన్సేషనల్ మూవీస్ అధినేత గోగినేని బాలకృష్ణ మాట్లాడుతూ "ఇంతటి గొప్ప చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసే అవకాశం లభించినందుకు గర్వంగా ఫీలవుతున్నా. సూపర్ హీరోలందరిలో మొదటివాడు, గొప్పవాడైన సూపర్‌మేన్ చాన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తున్నాడు. మంచి క్రేజ్ వచ్చిన ఈ సినిమాకి అంతే బాగా ఆదరణ లభిస్తోంది'' అన్నారు. ఈ సమావేశంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు.

సూపర్‌మేన్ సిరీస్ మొదలయ్యి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం విశేషం. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో సూపర్‌మేన్ విన్యాసాలు మరింత థ్రిల్‌ను కలిగిస్తాయి. ఈ సినిమాలో 40నిమిషాల పాటు వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. దాదాపు 175థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X