Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మహర్షి 19 రోజుల కలెక్షన్లు.. 200 కోట్ల దిశగా మహేష్ మూవీ.. కృష్ణకు బర్త్ డే కానుగా..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నది. దాదాపు 20 రోజులుగా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతున్నది. మూడు వారాలు దాటినా కలెక్షన్ల ధాటిని కొనసాగిస్తూ రూ.200 కోట్లవైపు దూసుకుపోతున్నది. గత 19 రోజుల మహర్షి సినిమా కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

19 రోజుల్లో రూ.175 కోట్లు
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అందాల తార పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుకెక్కనున్నది. గత 19 రోజుల్లో ఈ చిత్రం రూ.175 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం లేకపోలేదనే మాట వ్యక్తమవుతున్నది.

మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా
దేశానికి వెన్నుముకైన రైతు సమస్యలను ఆధారంగా తెరకెక్కిన మహర్షి చిత్రం రిలీజైన తొలి ఆట నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎపిక్ బ్లాక్‌బస్టర్‌గా మార్చారు. మహేష్ బాబు కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచే చిత్రంగా నిలిచింది. స్వయంగా ఈ చిత్రం మహేష్ బాబు కాలర్ ఎత్తుకునేలా చేసింది.

బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లు
మే 9న రిలీజైన మహర్షి చిత్రం 19 రోజుల దాటిన తర్వాత కూడా ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా ఉంది. మూడో వారంలో కూడా నిలకడగా వసూళ్లు సాధిస్తూ నాలుగోవారంలోకి ప్రవేశించింది. మహర్షి విజయం మాకు అద్భుతమైన ఫీలింగ్‌ను, మంచి ఆనందాన్ని ఇచ్చింది అని పీవీపీ, వైజయంతి మూవీస్, వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్‌లో వెల్లడించింది.

సూపర్ స్టార్ కృష్ణకు బర్త్ డే కానుకగా
మహర్షి చిత్రాన్ని రూ.200 కోట్ల వసూళ్లను దాటించి సూపర్‌స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది. సూపర్ స్టార్ కృష్ణ మే 31న తన జన్మదినాన్ని జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కృష్ణ బర్త్ డే కోసం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.