Jailer box office Report చరిత్ర సృష్టించిన రజనీకాంత్.. జైలర్‌కు 240 కోట్ల టార్గెట్.. ఎన్ని కోట్ల లాభాలు అంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన జైలర్ చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తూ రికార్డులను బ్రేక్ చేస్తూ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఈ సినిమా గత 26 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రజనీకాంత్ తన కెరీర్‌లో అత్యున్నత బాక్సాఫీస్ రికార్డును ఖాతాలో వేసుకొన్నాడు. ఈ సినిమా తమిళ సినిమా రికార్డులను తిరగరాసింది. ప్రాంతీయ చిత్రంగా వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయి కలెక్షన్లను రాబట్టింది. పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల కనకవర్షం కురిపించింది.

Superstar Rajinikanths Jailer worldwide collections, Break Even and Profit details

జైలర్ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. రజనీకాంత్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల మ్యాజిక్ క్రియేట్ చేసింది. తొలివారం ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 236 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళంలో 185 కోట్లు, తెలుగులో 47 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు రాబట్టింది.

Superstar Rajinikanths Jailer worldwide collections, Break Even and Profit details

జైలర్ రెండో వారం నుంచి కలెక్షన్ల వేగం మందగించింది. ఇక రెండోవారంలో 63 కోట్లు వసూలు చేసింది. తమిళంలో 46 కోట్లు, తెలుగులో 13 కోట్లు, కర్ణాటకలో 1 కోటికిపైగా, హిందీలో 2.5 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఈచిత్రం 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 22 కోట్లు, తెలుగులో 5.5 కోట్లు, కర్ణాటకలో 75 లక్షలు, హిందీలో 1.5 కోట్లు వసూలు చేసింది. గత 27 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 395 కోట్లు వసూలు చేసింది.

Superstar Rajinikanths Jailer worldwide collections, Break Even and Profit details

జైలర్ మూవీ ప్రాంతాల వారీగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 180 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటకలో 65 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది, ఏపీ, నైజాంలో కలిపి గత 27 రోజుల్లో 80 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. కేరళలో 53 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 16 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 395 కోట్ల వసూళ్లను సాధించింది.

Superstar Rajinikanths Jailer worldwide collections, Break Even and Profit details

ఇక జైలర్ మూవీ 26వ రోజు కూడా భారీగానే వసూళ్లను సాధించింది. తెలుగు, తమిళం, ఇతర భాషల్లో కలిపి మొత్తంగా 1.19 కోట్లు వసూలు చేసింది. ఇక 27వ రోజు అంటే మంగళవారం కూడా భారీగానే అంటే 1.41 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా మొత్తంగా 602 కోట్ల వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా నమోదు చేసినట్టు అవుతుంది.

Superstar Rajinikanths Jailer worldwide collections, Break Even and Profit details

జైలర్ సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా 240 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో బాక్సాఫీస్ జర్నీని రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఇండియాలో 395 కోట్లకుపైగా.. ఓవర్సీస్‌లో 200 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 600 కోట్ల క్లబ్‌లో సునాయసంగా చేరింది. తొలివారమే బ్రేక్ ఈవెన్‌ను సాధించి లాభాల్లోకి చేరి కలెక్షన్లతో పరుగులు పెట్టింది. ఇప్పటీకే ఈ చిత్రం 200 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఇంకా రానున్న రోజుల్లో మరింతగా లాభాలను సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X